Asianet News TeluguAsianet News Telugu

పెళ్లితో సంబంధం లేకుండా మహిళలు అబార్షన్ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

సురక్షితమైన అబార్షన్ కు ప్రతి ఒక్క మహిళ అర్హురాలేనని సుప్రీంకోర్టు తెలిపింది.వివాహితుల,అవివాహితులని అబార్షన్ విషయంలో వ్యత్యాసం చూపాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. 

On Abortion, Supreme Court's Massive Order
Author
First Published Sep 29, 2022, 11:52 AM IST

న్యూఢిల్లీ:సురక్షితమైన,చట్టబద్దమైన అబార్షన్ ప్రక్రియకు మహిళలంతా అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులనే వ్యత్యాసం చూపడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆప్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారంగా రేప్ నిర్వచనంలో వైవాహిక అత్యాచారం కూడా ఉంటుందని కోర్టు తీర్పు వెల్లడించింది.

చట్ట ప్రకారంగా సురక్షితమైన అబార్షన్ ను మహిళలు చేయించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెళ్లికాని మహిళలు కూడా అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది.  ఒక మహిళ వైవాహిక స్థితి ఆమెకు అబార్షన్ హక్కును హరించడానికి కారణం  కారాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పెళ్లికాని మహిళలు కూడా 24 వారాల్లో అవాంఛిత గర్భాన్ని కూడా రద్దుచేసుకొనేందుకు అర్హులని  ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.అవివాహిత మహిళలకు అవాంచిత గర్భాన్ని తొలగించుకొనే హక్కును తొలగించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని సుప్రీంకోర్టు పేర్కొంది. . ఎంటీపీ చట్టం ప్రకారం పెళ్లికాని మహిళ  అబార్షన్ చేసుకోవచ్చని  సుప్రీం కోర్టు తెలిపింది. 

జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నాడు కీలక తీర్పును వెల్లడించింది. 1971 చ,ట్టం వివాహిత మహిళలకు సంబంధించిందన్నారు. అయితే 2021 చట్ట సవరణ వివాహితులు, అవివాహితుల  మధ్య తేడా లేదన్నారు. చట్టబద్దమైన గర్భస్రావానికి మహిళలంతా అర్హులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య కృత్రిమ వ్యత్యాసాన్ని కొనసాగించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళలు స్వేచ్ఛగా గర్భస్రావం చేసుకొనేందుకు స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 

అసురక్షిత అబార్షన్ లపై పార్లమెంట్ చర్చ గణాంకాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. 67 శాతం అబార్షన్ లు సురక్షితం కాదని బ్రిటిష్  మెడికల్ జర్నల్ గ్లోబల్ హెల్త్ స్డడీని చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. సురక్షితమైన అబార్షన్ నిరాకరించడం వల్లే అసురక్షిత అబార్షన్ ల వైపు మహిళలు మొగ్గుచూపుతున్నారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

25 ఏళ్ల అవివాహిత మహిళ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెల్లడించింది. తనకు పెళ్లి కానందున అబార్షన్ కు అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన  తీర్పును సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేసింది. తాను గర్భం దాల్చి 23 వారాలైందని ఆ పిటిషన్ లో బాధితురాలు పేర్కొంది. తనను పెళ్లి చేసుకొనేందుకు తన భాగస్వామి నిరాకరించిన విషయాన్ని ఉన్నత న్యాయస్థానికి ఆమె తెలిపింది,.  ఐదుగురు తోబుట్టువుల్లో తాను పెద్దదని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లింది. తాను బిడ్డను పెంచే స్థోమత లేని కారణంగా  అబార్షన్ కు అనుమతివ్వాలని కోర్టును కోరింది. గర్భస్రావం చేసుకోవడంతో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని మెడికల్ బోర్డు తెలిపింది. దీంతో ఆమె అబార్షన్ చేసుకొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 

వివాహిత స్త్రీ బలవంతంగా గర్భం దాల్చడం రేప్ గా పరిగణించవచ్చు: సుప్రీంకోర్టు

 వివాహిత మహిళ బలవంతంగా గర్భం దాల్చడాన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  అత్యాచారం అంటే సమ్మతి లేకుండా లైంగిక సంపర్కం లేదా సన్నిహిత  భాగస్వామి హింస అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బలవంతపు సెక్స్ వల్ల వివాహిత మహిళలు కూడా గర్భం దాల్చే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. బలవంతంగా వివాహిత గర్భం దాల్చడం  రేప్ కిందకే వస్తుందని కోర్టు చెప్పింది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios