నెల వారి పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని రేపు మరోసారి తెరవనున్న నేపథ్యంలో ఆలయ ప్రవేశం చేసేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పలు మహిళా సంఘాలు పంబా తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో భారీగా మకాం వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆలయంలోకి ప్రవేశించేందుకు 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సిద్ధంగా ఉన్నారంటూ స్థానిక ఎమ్మెల్యే పీసీ జార్జ్ గవర్నర్‌కు లేఖ రాయడం సంచలనం కలిగించింది. దీని కారణంగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని.. వీరందరినీ ఖాళీ చేయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.. నీలక్కల్ నుంచి పంబ వరకు భారీగా పోలీసులను మోహరించారు.. శబరిమల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు నీలక్కల్ దగ్గరకు భారీగా చేరకుంటున్న అయ్యప్ప భక్తులు.. 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆలయ ప్రవేశం చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అన్ని వయస్సుల మహిళలను అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. గత నెలలో కొందరు హేతువాదులు, సామాజిక కార్యకర్తలు మహిళల చేత అయ్యప్ప ఆలయ ప్రవేశం చేసేందుకు యత్నించారు. అయితే అయ్యప్ప భక్తులు వీరిని మార్గమథ్యంలోనే అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

శబరిమలలోకి మహిళల ప్రవేశం..517 కేసులు.. 3,345 మంది అరెస్ట్

శబరిమల తీర్పుకి మద్దతు పలికిన స్వామీజీ... ఆశ్రమానికి నిప్పు

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు...వేటు వేసిన బీఎస్ఎన్ఎల్

శబరిమలలో మహిళల ప్రవేశం.. రివ్యూ పిటిషన్‌పై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి