గుజరాత్ కాంగ్రెస్ అధికార వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైంది. గుర్తు తెలియని వ్యక్తి వెబ్ సైట్ ని హ్యాక్ చేశాడు. ఇటీవల హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయనను ఇరకాటంలో పెట్టేందుకే వెబ్ సైట్ ని హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.

2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హార్దిక్ పటేల్ కి చెంది సెక్స్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా..ఆ వీడియోలో ఉన్నది నేను కాదంటూ.. హార్దిక్ చెప్పినా... ఎవరూ వినిపించుకోలేదు. అయితే.. ఇప్పుడు ఆ వీడియోలను కాంగ్రెస్ వెబ్ సైట్ లో పెట్టడం గమనార్హం.

కొత్త నేతకు స్వాగతం అనే క్యాప్షన్ తో ఆ వీడియోలను పోస్టు  చేశారు. దీనిని వెంటనే గమనించిన కాంగ్రెస్ పార్టీ.. టెక్నికల్ టీంని సంప్రదించింది. తమ పార్టీ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారని.. హార్దిక్ కాంగ్రెస్ లో చేరడం ఇష్టంలేక ఈ పనికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. హార్దిక్ చెందిన ఫోటోలను, వీడియోలను అందులో నుంచి డిలీట్ చేశారు.