Asianet News TeluguAsianet News Telugu

భార్యతో గొడవపడి.. 9 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. మధ్యప్రదేశ్ లో ఘటన

కన్న కూతురుపైనే ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్య ఇంట్లోలేని సమయం చూసి తాగిన మత్తులో కూతురును రేప్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Father rapes 9-year-old daughter after arguing with wife.. Incident in Madhya Pradesh
Author
First Published Aug 11, 2022, 12:48 PM IST

ఓ వ్య‌క్తి తండ్రి అనే పేరుకే మ‌చ్చ తీసుకొచ్చాడు. తొమ్మిదేళ్ల కూతురు అని కూడా చూడ‌కుండా కామంతో రెచ్చిపోయాడు. ఆ బాలిక‌ను అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. ఈ దారుణం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. 

పెంపుడు కుక్కతో చిన్నారి దాగుడుమూతలాట.. ఎంతచక్కగా వింటుందో చూడండి...

దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి వృత్తిరీత్యా వడ్రంగి. మంగ‌ళ‌వారం అత‌డి భార్య‌తో గొడ‌వ జ‌రిగింది. ఈ క్ర‌మంలో అత‌డు భార్య‌పై ఉమ్మివేశాడు. దీంతో ఆమె కోపంతో త‌న 9 ఏళ్ల కూతురును అక్క‌డే విడిచిపెట్టి త‌న పుట్టింటికి వెళ్లిపోయింది.

త‌రువాత ఇంట్లోనే ఉన్న నిందితుడు తాగిన మ‌త్తులో కూతురును రేప్ చేశాడు. తెల్లారి అత‌డి భార్య పుట్టింటి నుంచి ఇంటికి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో బాలిక ఏడుస్తూ క‌నిపించింది. ఏం జ‌రిగింద‌ని ఆరా తీస్తే ఆ బాలిక త‌న‌పై జ‌రిగిన దారుణాన్ని త‌ల్లికి చెప్పింది. ఈ విష‌యంలో భ‌ర్తను ఆమె నిలిదీసింది. దీంతో అత‌డు భార్య‌ను బెదిరించాడు. ఎవ‌రికైనా చెబితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని కూతురును కూడా హెచ్చ‌రించాడు. 

భారత స్వాతంత్య్ర పోరాటం.. జ‌మ్మూకాశ్మీర్ లో హిందూ-ముస్లింల ఐక్య‌త వెల్లువిరిసిన వేళ‌.. !

అనంతరం ఆమె పోలీసు స్టేష‌న్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోస్కోలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం నిందితుడు ప‌రారీలో ఉన్నాడు. 

ఇలాంటి ఘ‌ట‌నే ఈ ఏడాది మార్చిలో బీహార్ లో వెలుగులోకి వ‌చ్చింది. ఇద్ద‌రు కూతుళ్ల‌పై క‌న్ తండ్రి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 14, 16 ఏళ్ల వ‌య‌స్సున్న ఇద్దరు బాలికలు బక్సర్ జిల్లా రాజ్​పుర్ తాలుకాలో ఉంటున్నారు. వీరి తండ్రి ఓ వైద్యుడు. విటమిన్ ట్యాబ్లెట్ల పేరిట ఆ బాలికలకు నిద్రమాత్రలు ఇచ్చేవాడు. అనంతరం తన క్లీనిక్​లోనే అత్యాచారం చేసేవాడు.  తండ్రిని ఎదురిస్తే తీవ్రంగా కొట్టేవాడని బాలికలు తెలిపారు. దీంతో అతడి హింసను తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయారు. బక్సర్​లో చిన్న అద్దె ఇంట్లో త‌ల‌దాచుకున్నారు. 

భారత 14వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీప్‌ ధన్‌కర్‌

త‌మ‌పై జ‌రిగిన అత్యాచారాన్ని వివ‌రిస్తూ ఆ బాలిక‌లు ఇద్ద‌రు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. తమపై జరిగిన లైంగిక దాడి ఘ‌ట‌న‌పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇదే త‌రుణంలో మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కొడుకు పుట్టాల‌న్న ఆశ‌తోనే తండ్రి ఓ తాంత్రికుడితో కలిసి బరితెగించాడని పోలీసులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios