2026 భారత్ అనేక ముక్కలుగా చీలిపోతుంది: ఇండియాపై విషం కక్కిన పాక్ మాజీ సెనేటర్.. వీడియో
Faisal Abidi : 2024 లోక్ సభ ఎన్నికల మూడ్ లో ఉన్న సమయంలో పాకిస్థాన్ మాజీ సెనేటర్ ఫైజల్ అబిదీ భారత అంతర్గత వ్యవహారాలు, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు.
former Senator of Pakistan Faisal Abidi : పాకిస్థాన్ మాజీ సెనేటర్ భారత్ పై మరోసారి విషం కక్కాడు. లోక్‌సభ ఎన్నికల 2024 మూడో లో ఉన్న భారత్ పై పాక్ మాజీ సెనేటర్ అయిన ఫైసల్ అబిది భారతదేశ అంతర్గత వ్యవహారాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి సంబంధించి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వివాదాన్ని రేకెత్తించారు. 'అఖండ భారత్'ను వర్ణించే భారత పార్లమెంటరీ కుడ్యచిత్రం నేపథ్యంలో అబిది చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
'అఖండ భారత్'ను ప్రతిబింబించే భారత పార్లమెంటరీ చిత్రపటం నేపథ్యంలో అబిదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ముఖచిత్రంలో ప్రతిధ్వనించాయి. నేపాల్, శ్రీలంక, భూటాన్, పాకిస్తాన్ దేశాలు భారత్ ప్రతీకాత్మక చర్యతో రెచ్చిపోయాయనీ, ఆ తర్వాత 2026 నాటికి భారత్ విచ్ఛిన్నమవుతుందని ఆయన జోస్యం చెప్పడం ఎన్నికల చర్చలో కొత్త కోణాన్ని చొప్పించింది.
జీటీవీ న్యూస్‌లో ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ మాజీ సెనేటర్ అబిదీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ 'హిందుత్వ' అజెండా గురించి, భారతీయుల నుండి పెద్ద ఎత్తున మద్దతు పొందడం గురించి ప్రశ్నించగా, అబిదీ స్పందిస్తూ.. 'భారత్ తమ పార్లమెంటులో అఖండ భారత్ చిత్రపటాన్ని ఉంచినప్పుడు నేపాల్, శ్రీలంక, భూటాన్, పాకిస్థాన్ లు ఆగ్రహానికి గురయ్యాయి. దీని గురించి పాకిస్తాన్ మాట్లాడినప్పుడు ప్రజలు మమ్మల్ని ఎగతాళి చేశారు, కానీ అది నిజం అని తేలిందన్నా'రు.
అలాగే, '2026 నవంబర్ 26 న అల్లాహ్ సంవత్సరం, భారతదేశం ముక్కలుగా విచ్ఛిన్నమవుతుంది. భారతదేశం చాలా ముక్కలుగా చీలిపోతుంది, మీరు ఆశ్చర్యపోతారు. మోడీ హిందుత్వ ఎజెండా నుంచి ప్రజలను బయటకు తీసుకురావడం ఒక్కటే ప్రజలను కాపాడే ఏకైక మార్గం. ఏజెన్సీల ద్వారా ప్రమాదం జరగవచ్చు, కానీ మోడీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని నాశనం చేయాలి, అది చాలా ముఖ్యమంటూ' తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అబిది చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ముఖ్యంగా మోడీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనడంపై భారత అన్ని వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వస్తున్నాయి. "దీని అర్థం..... వారు తమ మందుగుండు సామగ్రిని, మానవ వనరులను భారతదేశం, పాకిస్తాన్‌లలో సిద్ధంగా ఉంచుకున్నారు" అని ఎక్స్‌లోని ఒక యూజర్ పేర్కొన్నాడు. మరో యూజర్.. "పేదగా మారిన మీ దేశంపై దృష్టి పెట్టండి. భారతదేశం గురించి చింతించకండి. భారతదేశం తనను తాను చూసుకుంటుంది. ముందు మీ దేశాన్ని రక్షించమని అల్లాకు చెప్పండి" అని కౌంటర్ ఇచ్చాడు. మరోకరు.. "బహుశా పాకిస్తానీ పౌరులు తమ స్వంత పనులపై దృష్టి సారించాలి" అని అన్నాడు. "పాకిస్థాన్ ముక్కలుగా ముక్కలు చేయబడుతుందని అతను తప్పుగా విన్నాడని నేను భావిస్తున్నాను" అని మరొకరు కామెంట్ చేశారు.