న్యూఢిల్లీ: దేశంలో  ఒకే పవర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకే విద్యుత్‌ను సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు అవసరమని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

శుక్రవారం నాడు కేంద్ర  ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్టుగా  ఆమె చెప్పారు. పవర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా  దేశంలో  ప్రతి ఒక్కరికీ విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం  ప్రకటించింది.

పవర్ గ్రిడ్ ద్వారా  రాష్ట్రాలకు అతి తక్కువ ధరకే  విద్యుత్‌ను అందిస్తామని  మంత్రి ప్రకటించారు. విద్యుత్ టారిఫ్‌లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి  ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు