Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన  మహిళా మంత్రిగా  నిర్మల సీతారామన్  చరిత్ర సృష్టించనున్నారు.ప్రధానమంత్రిగా ఉంటూనే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరున ఉంది.
 

Union Budget 1970: When Indira Gandhi took a jibe at smokers in budget speech
Author
New Delhi, First Published Jul 5, 2019, 10:39 AM IST

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన  మహిళా మంత్రిగా  నిర్మల సీతారామన్  చరిత్ర సృష్టించనున్నారు.ప్రధానమంత్రిగా ఉంటూనే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరున ఉంది.

 1970-71 లో ప్రధానమంత్రి హోదాలోనే ఇందిరా గాంధీ పార్లమెంట్‌లో  బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రిగా ఉంటూనే ఆమె ఆ సమయంలో  ఏడాదిపాటుగా  ఆర్థిక శాఖను కూడ నిర్వహించారు.

కేంద్రంలో రెండో దఫా మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్మల సీతారామన్‌కు కీలకమైన పదవిని ఇచ్చారు. గత టర్మ్‌లో ఆమెకు రక్షణ శాఖను కేటాయించారు. ఈ దఫా ఆమెకు ఆర్థిక శాఖను కేటాయించారు.

 ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సిగరెట్ ప్రియులకు ఇబ్బందిగా మారింది. సిగరెట్టుపై పన్నును 3 నుండి 22 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకొంది.  సిగరెట్టుపై పన్ను పెంపు ద్వారా ఆనాడు ప్రభుత్వానికి అదనంగా  రూ. 13.50 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని  ఇందిరాగాంధీ  అభిప్రాయపడ్డారు.

మరో వైపు ఫుడ్, వెజిటబుల్ జ్యూస్, ఇన్‌స్టంట్ కాఫీ , ఇన్‌స్టంట్ టీ, జెల్లీ, క్రిస్టల్స్, డ్రింకింగ్ చాక్లెట్స్,  ప్రాసెస్‌డ్ చీస్ తదితర వస్తువులపై పన్నులను పెంచారు.ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మల సీతారామన్ ఈ దఫా ప్రజలకు రాయితీలను కల్పిస్తారో. భారం మోపుతారో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios