న్యూఢిల్లీ: దేశంలోని దుకాణ యజమానులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు  ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో  దుకాణదారులకు కొత్త పెన్షన్ స్కీమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టుగా ప్రకటించింది.చిన్న రిటైల్ ట్రేడర్స్‌కు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు.   కొత్త పెన్షన్ స్కీమ్ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని  ఆమె చెప్పారు.  

ఏటా రూ.1.5 కోట్ల టర్నోవర్  ఉన్న దుకాణదారులకు ఈ స్కీమ్ పరిధిలోకి వస్తారని  ఆమె ప్రకటించారు. ఈ పథకానికి  ప్రధానమంత్రి కర్మ యోగి మాన్ ధన్ స్కీమ్ అని పేరు పెట్టినట్టుగా  మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు