Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌ముఖ‌ రచయిత్రి అరుంధతీ రాయ్ ఇంట విషాదం.. 

ప్ర‌ముఖ రచయిత్రి, మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె తల్లి మేరీ రాయ్ (89) గురువారం కన్నుమూశారు.

educator and champion of gender equality Mary Roy passes away
Author
First Published Sep 1, 2022, 3:43 PM IST

ప్ర‌ముఖ రచయిత్రి, మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె తల్లి మేరీ రాయ్ (89) గురువారం కన్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె కేరళలోని కొట్టాయంలోని స్వ‌గృహాంలో తుదిశ్వాస వీడిచారు.  

మేరీ రాయ్ కూడా  ప్ర‌ముఖ విద్యావేత్త‌, మ‌హిళా హ‌క్కుల కార్య‌క‌ర్త. కేర‌ళ‌లోని సిరియ‌న్ క్రిస్టియ‌న్లు ఆచ‌రించే లింగ వివ‌క్ష‌తో కూడిన వార‌సత్వ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆమె పోరాటం చేశారు. కేరళలోని సిరియన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మహిళలకు కుటుంబ ఆస్తిలో సమాన హక్కులను నిర్ధారించే కేసులో ఆమె  1986లో సుప్రీంకోర్టు దావాలో విజ‌యం సాధించారు. ఆమె జీవితంలో ఇదోక మైలురాయి. ఈ కేసులో మేరీ రాయ్ సిరియన్ క్రైస్తవ సంఘం అనుసరించిన ట్రావెన్‌కోర్ వారసత్వ చట్టం-1916, కొచ్చిన్ వారసత్వ చట్టం- 1921 నిబంధనలను సవాలు చేసింది.

ఈ చట్టాల ప్రకారం.. ఒక కుటుంబంలో స్త్రీ, పురుషుల‌కు స‌మాన హ‌క్కులుండేవి కావు. తండ్రి ఆస్తిలో వాటా కావాలంటే.. త‌న తోడ‌బుట్టిన మ‌గ‌వాడులో చనిపోతే.. వారి వాటాలో పావు వంతు లేదా రూ. 5,000, ఏది తక్కువైతే అది పొందేందుకు అర్హులు... ఈ చ‌ట్ట నిబంధ‌న‌ల‌పై మేరీ సవాలు చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న సంఘంలోని సభ్యులు భారతీయ వారసత్వ చట్టం-1925 నిబంధనలను అనుసరిస్తున్నార‌నీ, త‌న ఆమె సోదరుడు జార్జ్ ఐజాక్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు.
 
ఈ కేసులో సుప్రీంకోర్టు 2010లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.  అంటే.. ఈ దావా వేసిన 24 సంవత్సరాల తర్వాత..  కొట్టాయంలోని సబ్-కోర్టు మేరీకి అనుకూలంగా తుది డిక్రీని అమలు చేసింది. ఆమె కుటుంబ ఆస్తిలో వాటాను పొందింది, వివిధ ప్రాంతాలలో చ‌ట్టాల‌పై పెద్ద ఎత్తున అవ‌గాహానా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.  
 
ఆ సంద‌ర్బంలో ఆమె మాట్లాడుతూ.. “ఎట్టకేలకు నా 50 ఏళ్ల పోరాటం విజ‌యం సాధించింది. ఈ పోరాటం కేవలం భూమి కోసం మాత్ర‌మే కాదు.. రాజ్యాంగం క‌ల్పించిన మహిళల హక్కులను సాధించుకోవడం కోసమని అన్నారు. 1960లో తన తండ్రి మరణానంతరం వదిలిపెట్టిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని రాయ్ కొట్టాయం సబ్-కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో ఆస్తిపై హ‌క్కు సాధించింది. 

మేరీ రాయ్ కొట్టాయంలోని కులీన కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి, PV ఐజాక్, ఇంగ్లాండ్‌లో శిక్షణ పొంది, బీహార్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో అధ్యాపకుడిగా సేవాలందించారు. ఈ క్ర‌మంలో మేరీ రాయ్..  ఢిల్లీ, మద్రాసులో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత.. ఆమె కోల్‌కతాకు వెళ్లింది. ఈ క్ర‌మంలో ఆమె  రాజీబ్ రాయ్‌ను వివాహం చేసుకున్నది.  

అస్సాం టీ ఎస్టేట్‌లో మేనేజర్‌గా ప‌నిచేయ‌డంతో ఆయ‌న‌తో వెళ్లింది. వారి ఇద్దరు పిల్లలు, లలిత్, అరుంధతి.
కొన్ని కార‌ణాల వ‌ల్ల రాజీబ్ రాయ్‌,  మేరీ రాయ్ లు విడిపోవాల్సి వ‌చ్చింది. దీంతో ఆమె తన పిల్లలతో క‌లిసి కేరళకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమె తన తండ్రితో కలిగి తమిళనాడులోని ఊటీకి వెళ్లింది.

కొట్టాయంలో ప్ర‌ముఖ స్కూల్ ప‌ల్లికూదం వ్య‌వ‌స్ధాప‌కురాలిగా కూడా మేరీ రాయ్ వ్య‌వ‌హ‌రించారు. త‌న తండ్రి మర‌ణాంన‌త‌రం.. ఆమె ఉంటున్న ఇంటికి త‌న‌ పెద్ద సోదరుడు ఐజాక్ వారసుడినని, ఆమె ఉంటున్న‌ ఇంటిని ఖాళీ చేయాలని కోరుకున్నారు. దీంతో ఆమె ఈ విష‌యంపై సుప్రీంకోర్టుకు  వెళ్లి న్యాయ పోరాటం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios