MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి పీఠలపై రజనీకాంత్‌.. మ్యారేజ్‌ ఆపేందుకు కుట్ర.. స్నేహితుడిని కాపాడేందుకు స్వయంగా వచ్చిన మెగాస్టార్..

పెళ్లి పీఠలపై రజనీకాంత్‌.. మ్యారేజ్‌ ఆపేందుకు కుట్ర.. స్నేహితుడిని కాపాడేందుకు స్వయంగా వచ్చిన మెగాస్టార్..

పెళ్లి పీఠలపై ప్రియురాలితో రజనీకాంత్‌ ఉన్నారు. మ్యారేజ్‌ ఆపేందుకు కుట్ర జరుగుతుంది.  తన స్నేహితుడు చిరంజీవి సాయం కోరాడు రజనీ. అంతే రంగంలోకి దిగాడు చిరు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 30 2024, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి మధ్య కెరీర్‌ ప్రారంభంలో మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతుంది. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు ఆ గ్యాప్‌ పెరిగిందని చెప్పొచ్చు. కెరీర్‌ పరంగా పెద్ద స్టార్లుగా ఎదగడం, కలుసుకునే అవకాశం రాకపోవడంతో క్రమంగా ఆ దూరం పెరిగింది. కానీ ఆనాటి స్నేహం మాత్రం వారి మనసులో అలానే ఉంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

అయితే రజనీకాంత్‌ స్నేహం కోసం తాను రంగంలోకి దిగిన సందర్భం ఉంది. రజనీకాంత్‌ సాయం కోరగానే వెంటనే వచ్చి అతన్ని కాపాడిన సందర్భం ఉండటం విశేషం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రజనీకాంత్‌ రెడీ అవ్వగా, ఆ పెళ్లి ఆపేందుకు కుట్ర జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి సాయం కోరారు రజనీకాంత్‌. దీంతో వెంటనే రంగంలోకి దిగి ప్రత్యర్థులను చిత్తు చేశారు మెగాస్టార్‌. 
 

38

మరి రజనీకాంత్‌కి చిరంజీవికి మధ్య ఉన్న స్నేహం ఏంటి? సూపర్‌స్టార్‌కి మెగాస్టార్‌ సాయం చేయాల్సిన అవసరమేంటి? ప్రేమ పెళ్లి ఏంటి? అనేది చూస్తే ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రజనీకాంత్‌ కోసం చిరంజీవి గెస్ట్ రోల్‌ చేశారు. రజనీ నటించిన `మప్పిల్లై` అనే తమిళ సినిమాల్లో గెస్ట్ గా మెరిశారు చిరంజీవి. 
 

48

తమిళ దర్శకుడు రాజశేఖర్‌ రూపొందించిన ఈ చిత్రంలో రజనీకాంత్, అమల జంటగా నటించారు. ఇందులో చిరంజీవి గెస్ట్ రోల్‌ చేశారు. క్లైమాక్స్ లో తాను ప్రేమించిన అమ్మాయి అమలని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు రజనీకాంత్‌. ఓ గుళ్లో ఈ మ్యారేజ్‌ ప్లాన్‌ చేస్తారు. విషయం తెలిసి హీరోయిన్‌ పేరెంట్స్ నుంచి ప్రమాదం ఉంటుంది. ఈ పెళ్లిని అడ్డుకోవాలని విలన్లని పంపిస్తారు. అందులో శ్రీహరి కూడా ఉంటారు. 
 

58

పెళ్లి జరుగుతున్న సమయంలోనే విలన్లు టెంపుల్‌ వద్దకు వస్తారు. లోపలికి వచ్చి రజనీకాంత్‌ మ్యారేజ్‌ని ఆపేయాలని ప్రయత్నిస్తారు. కానీ అంతలోనే చిరంజీవి ఎంట్రీ ఇస్తాడు. ముందు వార్నింగ్‌ ఇస్తాడు. వాళ్లు వినలేదు. దీంతో వారిని చితక్కొట్టుడు కొడతాడు. దీంతో చివరికి వాళ్లు పారిపోతారు. ఆ తర్వాత హీరోయిన్‌ అమ్మ తన బలగంతో వస్తుంది. తాడో పేడో తేల్చుకోవాలని వస్తుంది.

68

కానీ అంతలోనే హీరోయిన్‌ మెడలో మూడుముళ్లు వేస్తాడు రజనీ. అది చూసి కూల్‌ అయిపోతుంది. కోపాన్ని పక్కనపెట్టి ఆ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. ఇక తన పెళ్లి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగేలా చేసినందుకు,పిలవగానే వచ్చినందుకు చిరంజీవికి థ్యాంక్స్ చెబుతాడు రజనీ. స్నేహం కోసం ఏమైనా చేస్తానని చెప్పి రజనీకి మ్యారేజ్‌ విషెస్‌ చెబుతాడు చిరు. 

78

అలా కథ సుఖాంతం అవుతుంది. తాజాగా ఈ సీన్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. రజనీ సినిమాలో చిరు గెస్ట్ రోల్‌ అనేది అరుదైన విషయం, పైగా ఈ క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ కావడంతో మెగాస్టార్‌ అభిమానులు, రజనీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రజనీ అడగ్గానే చిరంజీవి ఆ రోల్ లో నటించారట. 
 

88

అంతకు ముందు చిరంజీవి, రజనీకాంత్‌ కలిసి `రనువ వీరన్‌` చిత్రంలో నటించారు. ఇద్దరు స్నేహితులుగా, ఆ తర్వాత శతృవులుగా కనిపించారు. ఇద్దరి మధ్య ఫైట్‌ అదిరిపోయేలా ఉంటుంది. దీంతోపాటు `బంధిపోటు సింహం`, `కాళీ` చిత్రాల్లో చిరంజీవి, రజనీ కలిసి నటించారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image2
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Recommended image3
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved