Asianet News TeluguAsianet News Telugu

నేడు గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గే.. నాడు ఇందిరా గాంధీపై తిరుగుబాటు చేశారని మీకు తెలుసా ?

137 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే ఓ సందర్భంలో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు. సోనియా గాంధీపై తిరుగుబాటు చేశారు. కానీ తరువాత గాంధీ కుటుంబానికి విధేయుడిగా మారిపోయారు. 

Do you know that Kharge, who is loyal to the Gandhi family today, rebelled against Indira Gandhi?
Author
First Published Oct 19, 2022, 4:52 PM IST

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. తనకు పోటీగా ఉన్న శశి థరూర్‌ను విజయానికి ఎంతో చాలా దూరంలోనే ఆపేశారు. అయితే నిజానికి ఈ ఫలితాలు నామినేషన్లు వేసిన రోజే తెలిసిపోయాయి. ఖర్గే.. గాంధీ కుటుంబం ఆశీర్వాదాలను మాత్రమే కాకుండా థరూర్‌ వెంట ఉండే తిరుగుబాటు జీ-23 నేతల మద్దతును కూడా పొందారు. కర్నాటక నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఖర్గే సోనియా గాంధీకి విధేయుడు. పదే పదే కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని విస్మరించినప్పటికీ దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్‌కు విధేయుడిగానే కొనసాగారు. 

కానీ ఆయన ఒక సమయంలో తిరుగుబాటు చేశారు. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పని చేశారు. 1970ల చివరిలో అప్పటి కర్ణాటక సీఎం దేవరాజ్ ఉర్స్, ప్రధాని ఇందిరా గాంధీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే అదే సమయంలో ఖర్గే తన రాజకీయ గురువుగా ఉర్స్ ను భావించేవారు. ఆయన సంజయ్ గాంధీ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని వ్యతిరేకించారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఉర్స్ సీఎం, ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ పదవులను కలిగి ఉన్నారు. ఆ రెండు పదవులను వదులుకోవడానికి కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. 

ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు: ఇద్దరు నిందితుల అరెస్టు.. వివ‌రాలు ఇవిగో..

ఆ సమయంలో కర్నాటకలో అత్యున్నత నాయకులలో ఒకరైన ఉర్స్ చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సపోర్టు ఉంది. ఈ వాస్తవం ఇందిరను నిరుత్సాహపరిచింది. ఉర్స్ జనతా పార్టీకి దగ్గరవుతున్నారని ప్రధాని అనుమానించారు. పలు పరిణామాల తరువాత చివరకు ఇందిర ఉర్స్ ను రాష్ట్ర యూనిట్ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. దీంతో ఆయన 1979లో కాంగ్రెస్ (యు) అనే చీలిక గ్రూపును ఏర్పాటు చేశారు. అయితే మల్లికార్జున్ ఖర్గే తన గురువుకు అండగా నిలిచారు. చీలిక గ్రూపులో చేరారు. 

అయితే ఈ గ్రూపు కర్నాటకలో ఒక్క సీటు కూడా గెలవకపోయింది. దీంతో 1980 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ఖర్గే కాంగ్రెస్‌ గూటికి తిరిగి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌కు విధేయుడిగానే ఉండిపోయారు. ఆయన తన కుమారులకు రాహుల్, ప్రియాంక్‌ లు అనే పేరు పెట్టారు. అలాగే కుమార్తెకు ప్రియదర్శిని ఇందిర పేరు పెట్టారు. ఖర్గే, అతని తండ్రి ఐదు సంవత్సరాల వయస్సులో బీదర్ నుండి గుల్బర్గాకు పారిపోయారని వివిధ నివేదికలు చెబుతున్నాయని ‘జీ న్యూస్’ నివేదించింది. రజాకార్లు వారి గ్రామంలో విధ్వంసానికి దిగి ఖర్గే తల్లి, సోదరిని హతమార్చారు.

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌ - కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ఖర్గే రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. మొదట విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత కార్మిక సంఘం నాయకుడిగా పని చేశారు. తరువాత న్యాయవాద వృత్తిని అభ్యసించి, చివరకు కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు. 1969లో గుల్బర్గా సిటీ యూనిట్ అధ్యక్షుడిగా నియమితులైన ఖర్గే మూడేళ్ల తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1976లో ఉర్స్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు. 

అయితే ఖర్గే మూడు సార్లు (1999, 2004, 2013)లో సీఎం పదవిని ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం ఆయనను విస్మరించింది. 2004లో ఎస్‌ఎం కృష్ణ పదవీ విరమణ చేసిన ప్రభుత్వంలో ‘నెంబర్ 2’గా ఉన్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని భావించారు. అయినప్పటికీ, ఆయన ధరమ్ సింగ్‌కు పదవిని వదిలేయాల్సి వచ్చింది. దీంతో ఖర్గే కలత చెందారు. ఈ విషయాన్ని సోనియా గాంధీతో మద్దతుదారులు సూచించినా..ఆయన దానికి నిరాకరించారు. 

ఓడిన తర్వాత శశిథరూర్ ఏమన్నారు? పార్టీలో మార్పులపై కీలక వ్యాఖ్య

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనను మొదట లోక్‌సభలో, ఆపై రాజ్యసభలో ఆయనను పార్టీ నాయకుడిగా నియమించి కాంగ్రెస్ అతడి విధేయతకు మొదటి సారిగా ప్రతిఫలమిచ్చింది. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్‌గా, దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ పదవిని చేపట్టిన మొదటి గాంధీయేతర వ్యక్తిగా ఆయన నిలిచారు. జగ్జీవన్ రామ్ (1969) తర్వాత కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన రెండో దళితుడిగా ఆయన నిలిచారు. అలాగే కర్ణాటక నుంచి ఎస్ నిజలింగప్ప (1968) తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన రెండో వ్యక్తిగా కూడా ఆయన రికార్డు నెలకొల్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios