Asianet News TeluguAsianet News Telugu

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌ - కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

మరో 25 సంవత్సరాల్లో రక్షణ రంగంలో భారత్ ప్రపంచానికే కేంద్రంగా మారబోతోందని రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. దేశాన్ని రక్షించాలనే భారత్ దృఢ సంకల్పాన్ని డిఫెక్స్‌పో 2022 ప్రతిబింబిస్తోందని ఆయన చెప్పారు. 

India will be the center of global defense manufacturing in the next 25 years - Union Defense Minister Rajnath Singh
Author
First Published Oct 19, 2022, 3:28 PM IST

రాబోయే 25 ఏళ్లలో ప్రపంచానికి రక్షణ తయారీ కేంద్రంగా భారతదేశం ఆవిర్భవిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అన్నారు. గుజరాత్ గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ‘డెఫ్‌ఎక్స్‌పో 2022’(డిఫెన్స్ ఎక్స్‌పో -2022)ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించాలనే భారత్ దృఢ సంకల్పాన్ని డిఫెక్స్‌పో 2022 ప్రతిబింబిస్తోందని అన్నారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. కాంగ్రెస్ లిస్ట్ ఇదే.. !

‘పాత్ టు ప్రైడ్’ అనేది ఈ డిఫెన్స్ ఎక్స్‌పో థీమ్ మాత్రమే కాదని, న్యూ ఇండియా కొత్త లక్ష్యం అని అన్నారు. భారత్‌ను బలమైన, స్వావలంబన కలిగిన దేశంగా మార్చాలనే ప్రధాని మోడీ విజన్ అది అని అన్నారు. అది న్యూ ఇండియా కొత్త లక్ష్యం అని చెప్పారు. ‘‘అమృతకల్’’ ప్రారంభంలో ఈ డెఫ్-ఎక్స్‌పోను నిర్వహించడం, దేశాన్ని రక్షించడానికి, రక్షణగా మారాలనే మన దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచానికి తయారీ కేంద్రంగా మారబోతుందని చెప్పారు. 

ఈ ఎక్సో నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అమృత్ కాల్ స‌మ‌యంలో దృఢ సంకల్పంతో రూపొందించిన కొత్త భార‌త‌దేశం, దాని సామర్థ్యాల చిత్రాన్ని ఇది చిత్రీక‌రిస్తోంద‌ని అన్నారు. ఇది దేశాభివృద్ధితో పాటు రాష్ట్రాల సహకార సమ్మేళనమని ఆయన తెలిపారు. ‘‘ ఇందులో యువత శక్తి , కలలు ఉన్నాయి. దీనికి యువత సంకల్పం, సామర్థ్యాలు ఉన్నాయి. ప్రపంచంపై ఆశలు, స్నేహపూర్వక దేశాలకు అవకాశాలు ఉన్నాయి.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

లక్షిత దాడులను నివారించడానికి కాశ్మీరీ పండిట్ లకు శిక్షణ, ఆయుధాలు ఇవ్వాలి - జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ వైద్

డిఫెక్స్  ఎక్స్ పో ఈ ఎడిషన్ ప్రత్యేకతను ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఇది భారతీయ కంపెనీలు మాత్రమే పాల్గొంటున్న మొట్టమొదటి డిఫెన్స్ ఎక్స్‌పో అని తెలిపారు. ఇందులో భారత్ లో తయారు చేసిన పరికరాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఉక్కు మనిషి, సర్దార్ పటేల్ భూమిలో మనం ఉన్నామని, ఇది భారతదేశ సామర్థ్యాలకు ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు. 

ఈ ఎక్స్‌పోలో 1300 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు ఉన్నారని, ఇందులో భారత రక్షణ పరిశ్రమ, దానితో అనుబంధం ఉన్న కొన్ని జాయింట్ వెంచర్‌లు, ఎంస్ఎంఈలు, 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది భారతదేశం సామర్ధ్యం, సాధ్యాసాధ్యాల సంగ్రహావలోకనాన్ని అందించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తొలిసారిగా 400 కంటే ఎక్కువ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఆయన పేర్కొనారు.

ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు:మల్లికార్జున ఖర్గే గెలుపు

ఈ సందర్భంగా ఉత్తర గుజరాత్‌లోని బనస్కాంతలోని దీసా వద్ద ఎయిర్ బేస్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా ఉద్భవిస్తుంది అని తెలిపారు. గత కొన్నేళ్లలో భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఎనిమిది రేట్లు పెరిగాయని కూడా ఆయన అన్నారు. ఇంతకుముందు పావురాలను వదిలామని, అయితే ఇప్పుడు చిరుతలను వదులుతున్నామని పేర్కొన్నారు. దేశం చాలా ముందుకు వచ్చిందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios