రోజూ ఏసీలో పడుకుంటే ఏమౌతుందో తెలుసా..?
ఏసీ నుంచి వచ్చే చల్లగాలులు... గాలిలోని తేమను తగ్గించేస్తాయి. ఫలితంగా.. అంతా పొడిబారిపోతుంది. దాని వల్ల.. చర్మం కూడా పొడిబారుతుంది. చర్మంపై దురద రావడం, స్కిన్ ఎలర్జీలు రావడం మొదలౌతాయి.
ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండల వేడి తట్టుకోలేక అందరూ ఏసీలు ఆన్ చేసుకొని పడుకుంటున్నారు. రాత్రిపూట మాత్రమే కాదు.. పగలు కూడా ఏసీలోనే గడిపేస్తున్నారు. ఏసీలో ఉన్నంతసేపు హాయిగానే ఉంటుంది. కానీ... ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో మీకు తెలుసా?
ఎండల్లో వేడి తగ్గించి మనకు హాయి అనుభూతి కలిగించినా .. ఏసీ లో ఎక్కువ సమయం గడపడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చర్మ వ్యాధుల నుంచి శ్వాసకోస వ్యాధుల వరకు ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్యలు ఏంటో ఓసారి చూద్దాం...
ఏసీ ఆన్ చేసినప్పుడు మనం ఆ చల్లదనం బయటకు వెళ్లకుండా ఉండేందుకు గది తలుపులు మూసేస్తాం. దీంతో.. ఆ గాలి అక్కడక్కడే తిరుగుతుంది. అంతేకాదు.. ఏసీ నుంచి వచ్చే చల్లగాలులు... గాలిలోని తేమను తగ్గించేస్తాయి. ఫలితంగా.. అంతా పొడిబారిపోతుంది. దాని వల్ల.. చర్మం కూడా పొడిబారుతుంది. చర్మంపై దురద రావడం, స్కిన్ ఎలర్జీలు రావడం మొదలౌతాయి.
దుమ్ము, ఎలర్జీలు లాంటి శాస్వ సంబంధిత సమస్యలు కూడా వచ్చేస్తాయి. చివరకు అవి ఆస్తమా కి కూడా దారితీస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఏసీని రెగ్యులర్ గా క్లీన్ చేయిస్తూ ఉండాలి. ఇన్ డోర్ ఎయిర్ క్వాలిటీ కూడా మెరుగుపరచాలి.
ఏసీని కనీసం క్లీన్ చేయించకుండా వాడుతూ ఉండటం వల్ల... కళ్లు కూడా డ్రైగా మారిపోతాయి. అంతేకాకుండా.. గొంతు నొప్పి సమస్యలు వస్తాయి. కాబట్టి.. ఐ డ్రాప్స్ వాడటం, నీరు ఎక్కువగా తాగడం లాంటివి చేయాలి. ఏసీ ఆన్ చేసినా రూమ్ టెంపరేచర్ మరీ తక్కువ పెట్టుకోకూడదు. 25, 26 డిగ్రీలు మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఉండదు.
కొందరికి అయితే... ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల... తలనొప్పి, వికారంగా కూడా ఉంటుంది. టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు చాలా మందికి సెన్సిటివ్ ఇష్యూస్ మొదలౌతాయి. దాని వల్ల.. కూడా ఇలాంటి తలనొప్పి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో.. నార్మల్ టెంపరేచర్ లో ఏసీ లో ఉంచి.. ఫ్యాన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది.
కొందరికి అయితే.. ఇమ్యూనిటీ పవర్ తగ్దిపోతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వచ్చేస్తాయి.మరీ ఎక్కువచల్లనదంలో పడుకోవడం వల్ల జాయింట్స్ పట్టేసి.. జాయింట్ పెయిన్స్ కూడా వచ్చేస్తాయి. ఆర్థరిటీస్ వచ్చాయా అనే అనుమానం కలుగుతుంది. కాబట్టి.. టెంపరేచర్ మరీ చల్లగా ఉండకుండా చూసుకోవాలి. అవసరం అయితే బ్లాంకెట్ కప్పుకోవాలి.