Asianet News TeluguAsianet News Telugu

తాతగా బ్రహ్మానందం, మనవడిగా కొడుకు.. టైటిల్‌ `బ్రహ్మా ఆనందం`.. సర్‌ప్రైజ్‌ చేసిన హాస్య బ్రహ్మ..

బ్రహ్మానందం తాతగా మారుతున్నారు. రియల్‌ లైఫ్‌లో కాదు, రీల్‌ లైఫ్‌లో తాతగా చేస్తున్నాడు. మనవడు మాత్రం ఆయన కొడుకే కావడం విశేషం. 
 

brahmanandam and his son announced their new film title brahma andandam arj
Author
First Published May 8, 2024, 1:44 PM IST

హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకి ఇటీవల సినిమాలు తగ్గాయి. కొత్త కమెడియన్లు రావడంతో ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం లేదు. దీంతో అడపాదడపా మాత్రమే వెండితెరపై సందడి చేస్తున్నారు బ్రహ్మానందం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని విధంగా కామెడీ ప్రపంచాన్ని శాషించిన ఆయన ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు. తాను కూడా చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు. తనలో కొత్త యాంగిల్స్ ని ఆవిష్కరిస్తున్నాడు. 

ప్రతి సినిమాలోనూ నవ్వించే బ్రహ్మానందం.. ఇటీవల `రంగమార్తాండ` చిత్రంలో ఏడిపించాడు. కాస్త సీరియస్‌ పాత్రలో కనిపించి చివరికి కన్నీళ్లు పెట్టించాడు. బ్రహ్మానందం ఎమోషనల్‌ సీన్స్ చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుగు ఆడియెన్స్ కి చూపించారు. అయితే ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. అయితే ఇందులో కామెడీ పాత్రనే కావడం విశేషం. తన పేరుతోనే సినిమా రాబోతుంది. తన కొడుకే హీరో. అయితే ఇందులో తండ్రి కొడుకులు కాస్త తాతామనవడిగా కనిపించబోతుండటం మరో విశేషం. 

`బ్రహ్మా ఆనందం` పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీని ప్రకటించారు. బుధవారం సినిమాని అనౌన్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇది చాలా ఫన్నీగా ఉంది. ముందుగా బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌ చెస్‌ ఆడుతున్నారు. ఈ క్రమంలో వెనకాల బ్రహ్మానందం కొడుకు, హీరో రాజా గౌతమ్‌ కనిపించాడు. ఆయన్ని చూసి.. పుష్కర కాలం అవుతుంది మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తాడట అని కొడుకు గురించి వెన్నెల కిశోర్‌ని ఆరా తీయగా, ఆ సినిమా డిటెయిల్స్  చెబుతాడు కిశోర్‌. అన్నీ ఉన్న సినిమాల కావాలని వెయిట్‌ చేస్తున్నాడని చెప్పగా, అలాంటిదే ఒకటి వచ్చిందని చెప్పగా, సడెన్‌గా వచ్చి పక్కన కూర్చున్నాడు. 

ఆ సినిమా కబుర్లు చెప్పారు. నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇలా అన్నీ ఓకే అయినట్టు తెలిపారు. ఇక తాత పాత్ర ఉందని, హీరోకి తాతగా చేయాలని, డైలాగులు కూడా ఉన్నాయని తెలపగా, ఎవరికైనా చెప్పాలా? అని ఫోన్‌ తీశాడు బ్రహ్మీ.. కానీ మీరే చేయాలని చెప్పడంతో షాక్‌ అయ్యాడు. దీంతో కాసేపు ఆవేశానికి గురై తాను తాతగానా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చివరికి టైటిల్‌ ఏంటని అడగ్గా, `బ్రహ్మా ఆనందం` అని చెప్పడం విశేషం. ఆద్యంతం ఫన్నీగా, హిలేరియస్‌గా ఉన్న ఈ వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో రాజా గౌతమ్‌ హీరోగా, ఆయనకు తాతగా బ్రహ్మీ కనిపించబోతున్నారు. 

ఇందులో వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్క నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుంది. అయితే తాజాగా ఇందులో రిలీజ్‌ డేట్‌ కూడా ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్‌ 6న సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. మొత్తంగా తండ్రీ కొడుకులు కలిసి ఏమాత్రం నవ్విస్తారో చూడాలి. 

ఇక రాజా గౌతమ్‌ పదేళ్లకి ఓ సినిమా చేసుకుంటూ వచ్చాడు. ఆయన 2004లో `పల్లకిలో పెళ్లి కూతురు` సినిమా చేశాడు. పాటలు బాగున్నా, సినిమా పెద్దగా ఆడలేదు. డిఫరెంట్‌ ఫిల్మ్ అనిపించుకుంది. ఆ తర్వాత పదేళ్లకి `బసంతి` చేశాడు. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆరేళ్ల క్రితం `మను` మూవీతో ప్రయోగం చేసినా వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు తండ్రితో కలిసి `బ్రహ్మా ఆనందం` సినిమా చేస్తున్నాడు. మరి ఈ మూవీతోనైనా హిట్‌ అందుకుంటాడా? బ్రహ్మానందం పేరు నిలబెడతాడా? అనేది చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios