న్యూఢిల్లీ: హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. 

కేంద్రప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ మండిపడ్డారు. మోదీకి, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం. తన తండ్రి చిదంబరంను చట్ట ప్రకారం అరెస్ట్ చేయలేదని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. 

తన తండ్రి చిదంబరం, కాంగ్రెస్ పార్టీని కేంద్రం టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈ కేసులో చిదంబరం ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ ఎవరో తమకు తెలియదని చెప్పుకొచ్చారు. తన తండ్రి అరెస్ట్ పై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని కార్తీ చిదంబరం స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ