న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత గులాం నబీ ఆజాద్. ఆర్టికల్ 370  రద్దు భారత రాజ్యాంగ విరుద్ధమంటూ అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కూనీ చేసిందంటూ మండిపడ్డారు. 

ఆర్టికల్ 370 రద్దును తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాము భారత రాజ్యాంగం వైపు ఉన్నామన్న ఆజాద్ ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నిబంధనలకు బీజేపీ తూట్లు పొడిచిందంటూ మండిపడ్డారు. 

జమ్ము కశ్మీర్ లో ఇటీవలే ఎన్నికలు సజావుగా జరిగాయని గుర్తు చేశారు. నిన్న మెున్నటి వరకు రాష్ట్రంలో పరిస్థితులు బాగానే ఉన్నాయని, పర్యాటకులు సైతం ప్రశాంతంగానే ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేలా ఉందంటూ ఆజాద్ ధ్వజమెత్తారు. 

భారత ప్రజల మనోభావాలతో కేంద్రం ప్రభుత్వం ఆటలాడుకుంటోందని విరుచుకుపడ్డారు ఎండీఎంకే నేత వైగో. కశ్మీర్‌లో అదనపు బలగాలను ఎందుకు మోహరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌ కూడా ఒక కోసోవో, తూర్పు తైమర్‌, దక్షిణ సూడాన్‌లా మారిపోకూడదంటూ విరుచుకుపడ్డారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కశ్మీర్ ను ఆక్రమించిన దేశంగా భారత్ మిగిలిపోతుంది: 370 రద్దుపై మాజీ సీఎం ముఫ్తీ ఫైర్

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

కశ్మీర్ ను ఆక్రమించిన దేశంగా భారత్ మిగిలిపోతుంది: 370 రద్దుపై మాజీ సీఎం ముఫ్తీ ఫైర్

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం