Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్ ను ఆక్రమించిన దేశంగా భారత్ మిగిలిపోతుంది: 370 రద్దుపై మాజీ సీఎం ముఫ్తీ ఫైర్

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు అత్యంత చీకటి దినం అంటూ వ్యాఖ్యానించారు. 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారంటూ మండిపడ్డారు. భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న ఆమె కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ex cm Mehbooba Mufti sensational comments on union government
Author
New Delhi, First Published Aug 5, 2019, 2:30 PM IST

న్యూల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని ఆమె ఖండించారు.  ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ ట్వీట్ చేశారు.

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు అత్యంత చీకటి దినం అంటూ వ్యాఖ్యానించారు. 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారంటూ మండిపడ్డారు. భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న ఆమె కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆర్టికల్‌ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం ఉద్దేశమేంటో ఇప్పుడు తేలిపోయింది. ప్రజలను భయపెట్టి కశ్మీర్‌ను లాక్కోవాలని చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భారత్‌ వైఫల్యం చెందిందంటూ దుయ్యబుట్టారు. కశ్మీర్‌ను ఆక్రమించిన దేశంగా భారత్‌ మిగిలిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మెహబూబా ముఫ్తీ. 

Follow Us:
Download App:
  • android
  • ios