Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ లో 60 మంది విద్యార్ధినుల నగ్న వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్: బాధితుల ఆందోళన

పంజాబ్ రాష్ట్రంలోని ఓ యూనివర్శిటీలో స్నానం చేస్తున్న 60 మంది నగ్న వీడియోలను సహచర విద్యార్ధిని తీసింది.ఈ వీడియోలను తన స్నేహితుడికి పంపింది.ఈ విషయం బయటకు రావడంతో బాధిత విద్యార్ధులు ఆందోళనకు దిగారు. 

Chandigarh University student caught making videos of 60 girls taking bath in Punjab
Author
First Published Sep 18, 2022, 10:18 AM IST


చండీఘడ్: పంజాబ్ రాష్ట్రంలోని ఓ యూనిరవ్శిటీలో స్నానం చేస్తున్న 60 మంది బాలికల నగ్న వీడియోలను మరో విద్యార్ధిని తీస్తూ పట్టుబడింది. సుమారు 60 మంది విద్యార్ధినుల నగ్న వీడియోలను తన స్నేహితుడికి పంపినట్టుగా  గుర్తించారు. ఈ వీడియోలను అతను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై బాధిత విద్యార్ధినులు ఆందోళనకు దిగారు.  మొహలీకి చెందిన విద్యార్ధిని యూనివర్శిటీలో చదువుతున్న తమ సహచర విద్యార్ధినుల నగ్న వీడియోలను  తీసింది. స్నానం చేసే సమయంలో ఆమె ఈ వీడియోలను రికార్డు చేసింది. సిమ్లాలో ఉన్న తన స్నేహితుడికి ఈ వీడియోలను పంపింది. ఈ వీడియోలను నిందితుడు  యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక మీడియా రిపోర్టు చేసింది. 

ఈ యూనివర్శిటీ  బయట బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనపై పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. ఘటనకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. యూనివర్శిటీలో విద్యార్ధులు ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. దోషులు ఎవరూ కూడ తప్పించుకోలేరని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయం అత్యంత సున్నితమైందన్నారు. ఇదీ పరీక్ష సమయంగా కూడా ఆయన పేర్కొన్నారు.ఈ సమయంలో మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉంటే ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసుకుందనే వార్తలపై యూనివర్శిటీ యాజమాన్యం ఖండించింది. ఆందోళన చేస్తున్న సమయంలో ఓ విద్యార్ధిని స్పృహ తప్పి పడిపోయిందన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా యూనివర్శిటీ వర్గాలు ప్రకటించాయి.  ఒక్క విద్యార్ధిని తన బాయ్ ప్రెండ్ కు తన ప్రైవేట్ వీడియోలను పంపిందని యూనివర్శిటీ మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఇతర విద్యార్ధినుల వీడియోలు లీకైందనిసాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని యూనివర్శిటీ మేనేజ్ మెంట్ వివరించింది.  ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదే విషయాన్ని  కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. తన వ్యక్తిగత వీడియోలను మాత్రేమే తన స్నేహితుడికి ఆమె పంపిందని ఆ  మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఇతర విద్యార్ధినుల వీడియోలు లేవని ఆ కథనాలు చెబుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios