MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • మరోసారి కలుస్తున్న రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ.. రౌడీబాయ్‌ దిమ్మతిరిగే లైనప్‌.. ఈ బర్త్ డే చాలా స్పెషల్‌

మరోసారి కలుస్తున్న రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ.. రౌడీబాయ్‌ దిమ్మతిరిగే లైనప్‌.. ఈ బర్త్ డే చాలా స్పెషల్‌

విజయ్‌ దేవరకొండ ఈ బర్త్ డేకి బ్యాక్‌ టూ బ్యాక్‌ సర్‌ప్రైజ్‌లతో రాబోతున్నారు. తన లైనప్‌లో ఉన్న సినిమాల అప్‌ డేట్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాదు రష్మికతో మరోసారి జోడీ కడుతున్నాడట.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 08 2024, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిన్న చిన్న రోల్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. `ఎవడే సుబ్రమణ్యం` చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో విజయ్‌ చేసిన అల్లరి మామూలు కాదు. ఆయన ఎనర్జీ నానిని డామినేట్‌ చేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత సోలో హీరోగా `పెళ్లి చూపులు` పడింది. తరుణ్‌ భాస్కర్‌ ఈ మూవీని తెరకెక్కించారు. చిన్నగా వచ్చి పెద్ద విజయం సాధించింది. హీరోగా విజయ్‌కి ఊపిరి పోసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ క్రమంలోనే రౌడీ బాయ్‌కి ఆ ట్యాగ్‌ తెచ్చేమూవీ పడింది. సందీప్‌ రెడ్డి వంగా రూపంలో `అర్జున్‌ రెడ్డి` పడింది. ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీని షేక్‌చేసింది. సినిమా మేకింగ్‌ పరంగా, హీరోయిజం పరంగా బౌండరీలు బ్రేక్‌ చేసిన చిత్రమిది. దీంతో విపరీతమైన కల్ట్ ఫ్యాన్‌ ఏర్పడింది. మాస్‌లోకి వెళ్లిపోయాడు విజయ్‌. దీంతో మేకర్స్ సైతం ఆయనతో సినిమాలకు క్యూ కట్టారు. ఆ వెంటనే `గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ పడింది. పరశురామ్‌ మంచి ఫ్యామిలీ లవ్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారు. ఈ చిత్రం వంద కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీకి షాకిచ్చింది. 
 

37

దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు హిట్లతో విజయ్‌ రేంజ్‌మారిపోయింది. స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి, బన్నీ లాంటి వాళ్లు ఆయన్ని అభినందించారు. అదే సమయంలో అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఒకప్పుడు ఉదయ్‌ కిరణ్‌, పవన్‌ కళ్యాణ్‌, తరుణ్‌లకు ఎలా అయితే ఫాలోయింగ్‌ వచ్చిందో, విజయ్‌కి ఆ రేంజ్‌ క్రేజ్‌ రావడం విశేషం. ఇండస్ట్రీ మొత్తం అతని గురించే చర్చ. తనగురించే అంతా మాట్లాడుకునేలా చేశాడు విజయ్‌. కానీ ఆ తర్వాత సరైన హిట్‌ పడలేదు. తన రేంజ్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు విజయ్‌. `ఖుషి` ఫర్వాలేదనిపించుకోగా, ఇటీవల వచ్చిన `ఫ్యామిలీ స్టార్‌` డిజాప్పాయింట్‌ చేసింది. 
 

47

ఇప్పుడు భారీ లైనప్‌తో ముందుకెళ్తున్నాడు విజయ్‌. ఆ మధ్య `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ ఆయన్ని కలవడం విశేషం. వీరి కాంబోలో సినిమా రాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమచారం మేరకు విజయ్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ప్రస్తుతం విజయ్‌ `వీడీ12` చిత్రంలో గౌతమ్‌ తిన్ననూరితో చేస్తున్నారు. గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే యాక్షన్‌ మూవీ ఇది. నెక్ట్స్ లెవల్‌ ప్లానింగ్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 

57

మరోవైపు ఇటీవల `రాజావారు రాణిగారు` ఫేమ్‌ రవికిరణ్‌ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్‌ అయ్యారు. దిల్‌ రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఇది `వీడీ15`గా తెరకెక్కబోతుంది. దీని కంటే ముందే తనకు `టాక్సీవాలా` వంటి చిత్రాన్ని ఇచ్చిన రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్‌. అయితే ఇందులో రష్మిక మందన్నా పేరు వినిపిస్తుంది. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
 

67

 ఇదిలా ఉంటే రాహుల్‌ సాంక్రిత్యాన్‌ మూవీలో హీరోయిన్‌గా నేషనల్‌ క్రష్‌ పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే `గీతగోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి జోడీ కడుతున్నారట. అయితే విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. రష్మిక కూడా అలాంటి హింట్లే ఇస్తూ వస్తోంది. మరి ఈ బర్త్ డేకి తన ప్రియుడి కోసం నేషనల్‌ క్రష్‌ ఏం చేయబోతుందో చూడాలి.  

77

అయితే రేపు మే 9న విజయ్‌ దేవరకొండ తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా గురువారం ఆయన నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు రాబోతున్నాయట. దీంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేకంగా బర్త్ డే సీడీపీ కూడా రాబోతుంది. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved