జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపైనింగ్ లో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ అతి త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపైనింగ్ లో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ అతి త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు పవన్ కి మద్దతు తెలిపారు. 

స్వయానా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వీడియో రిలీజ్ చేశారు. బుల్లితెర నటీనటులు.. జబర్దస్త్ ఆర్టిస్టులు.. జానీ మాస్టర్, హైపర్ ఆది లాంటి వాళ్లంతా గ్రౌండ్ లో తిరుగుతూ జనసేన పార్టీకి ప్రచారం చేస్తున్నారు. 

ఇటీవల నేచురల్ స్టార్ నాని కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కి మద్దతు తెలిపారు. ఆయన చేసే యుద్ధంలో విజయం సాధించాలని కోరారు. ఇక భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశి అయితే ఏకంగా పిఠాపురం వెళ్లి ప్రతి ఇల్లూ తిరుగుతూ జనసేన పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. 

Scroll to load tweet…

ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు నరేష్ కూడా పవన్ కి మద్దతు ప్రకటించారు. డియర్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీకి నేను ప్రారంభం నుంచి మద్దతు దారుడిగా ఉన్నాను. నీ నాయకత్వం నాకు ఆదర్శం. నీ జర్నీ ప్రజలకు ఒక ఆశాకిరణం లాంటిది. నువ్వు చేపట్టిన ఈ మిషన్ లో నీకు మా అందరి మద్దతు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీ ఘనవిజయం సాధించాలని కోరుతున్నా అంటూ నరేష్ పోస్ట్ చేశారు. ఆయన ట్వీట్ వైరల్ గా మారింది.