Asianet News TeluguAsianet News Telugu

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

అవకాశం దొరికితే చాలు బీజేపీపై విమర్శల దాడికి దిగుతున్నారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ స్కాం జరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాహుల్ గాంధీకి ఇప్పుడు సీబీఐ రూపంలో మరో అవకాశం వచ్చింది. 

CBI a weapon of political vendetta, tweets Rahul Gandhi
Author
Delhi, First Published Oct 24, 2018, 3:30 PM IST

ఢిల్లీ: అవకాశం దొరికితే చాలు బీజేపీపై విమర్శల దాడికి దిగుతున్నారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ స్కాం జరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాహుల్ గాంధీకి ఇప్పుడు సీబీఐ రూపంలో మరో అవకాశం వచ్చింది. అవకాశం వస్తే చాలు బీజేపీపై విరుచుకుపడుతున్న రాహుల్ సీబీఐ వివాదంపైనా వదిలిపెట్టడం లేదు. 

సీబీఐ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రాఫెల్‌ డీల్‌కు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను తప్పించారని ఆరోపించారు. రాఫెల్‌ పత్రాలను సేకరిస్తున్నందుకే సీబీఐ చీఫ్‌ అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపారని విమర్శించారు. రాఫెల్‌ స్కాంను నిగ్గుతేల్చేవారెవరైనా తొలగించడం లేదా వారిని నాశనం చేస్తానని ప్రధాని విస్పష్ట సంకేతాలు పంపుతున్నారన్నారు. 

మోదీ హయాంలో రాజ్యాంగం, దేశం పెనుప్రమాదంలో పడ్డాయని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. అటు రాజస్ధాన్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలోనూ మోదీపై విరుచుకుపడ్డారు. గత రాత్రి కాపలాదారు మోదీ రాఫెల్‌ డీల్‌పై ప్రశ్నిస్తున్న సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని వ్యాఖ్యానించారు. 

ఈ వార్తలు కూడా చదవండి


న్యూఢిల్లీ: పారదర్శకంగా విచారణ జరిగేందుకే  ఆరోపణలు చేసుకొంటున్నఇద్దరు సీనియర్ అధికారులను  సెలవుపై పంపినట్టుగా  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 

సీబీఐ అధికారులను సెలవుపై వెళ్లిన విషయమై  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు స్పందించారు.  సీబీఐ అధికారులపై అవినీతి ఆరోపణలను విచారించేందుకు  కొత్త బృందాన్ని కూడ నియమించినట్టు  ఆయన గుర్తు చేశారు. 

సీబీఐ ప్రత్యేక అధికారి రాకేష్ ఆస్థానాపై నమోదైన కేసు విచారించేందుకు సీబీఐ డీఐజీ తరుణ్ గోబా, ఎస్పీ సతీష్ దాగర్, జాయింట్ డైరెక్టర్ వి. మురుగేశంను నియమించినట్టు చెప్పారు.

సీబీఐ ఒక ప్రధాన దర్యాప్తు సంస్థ. దాని  విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మేరకు ఇద్దరు సీబీఐ అధికారులపై ఉన్న కేసులను విచారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సీబీఐలోని ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పుడు నిందితులే. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. సీబీఐ సమగ్రతను కాపాడటం కోసం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జైట్లీ స్పష్టం చేశారు. 

ఇద్దరు సీబీఐ అధికారులపై వస్తోన్న ఆరోపణలను ఏ ఏజెన్సీ అయినా విచారణ చేయవచ్చని సీవీసీ వెల్లడించింది. అందువల్లే అలోక్‌ వర్మ, ఆస్థానాను సెలవుపై పంపిస్తున్నాం. ఇది తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. సీవీసీ ప్రతిపాదన మేరకే ప్రభుత్వం సీబీఐ అధికారులపై ఈ చర్య తీసుకుందని జైట్లీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

Follow Us:
Download App:
  • android
  • ios