న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారులు  అలోక్ వర్మ, సీబీఐ స్పెసల్ డైరెక్టర్  రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం 2017 లో ప్రారంభమైంది. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాల మధ్య కొంతకాలంగా  వివాదం కొనసాగుతోంది.సీవీసీకి చెందిన ఐదుగురు సభ్యులతో  సమావేశమై  రాకేష్ ఆస్థానాను  స్పెషల్ డైరెక్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకించారు.

అయితే ప్యానెల్ మాత్రం  రాకేష్ ఆస్థానాను  స్పెషల్ డైరెక్టర్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకొంది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడ ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

అయితే ఈ ఏడాది జూలై 12వ తేదీన  వర్మ విదేశీ పర్యటనకు వెళ్లాడు. అయితే సీవీసీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రమోషన్ల కోసమే  ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి సీబీఐలో నెంబర్ 2 గా ఉన్న రాకేష్ ఆస్థానాను  సీవీసీ  ఆహ్వనించింది. కానీ, ఈ సమావేశానికి సీబీఐలో నెంబర్ 2 గా  రాకేష్‌ ఆస్థానాను ఆహ్వానించడంపై  అలోక్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ లో తన తర్వాతి స్థానంలో  రాకేష్ ఆస్థానాను పిలవకూడదని సీవీసీకి లేఖ రాశారు.

ఇదిలా ఉంటే  ఆగష్టు 24వ తేదీన రాకేష్ ఆస్థానా సీవీసీకి, కేబినెట్ కార్యదర్శికి  లేఖ రాశారు. అలోక్ వర్మ  రెండు కోట్లు మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో  తీసుకొన్నాడని  ఆరోపించారు.హైద్రాబాద్ వ్యాపారి సతీష్ సానా ద్వారా  ఈ వ్యవహరం జరిగిందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.

అంతేకాదు  ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో  అస్థానా మరోసారి సీవీసీకి , కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశాడు.  సతీష్ సానాను అరెస్ట్  చేయాలని తాను భావిస్తే... అలోక్ వర్మ అడ్డుకొంటున్నాడని ఈ లేఖలో పేర్కొన్నాడు.ఫిబ్రవరి మాసంలో సతీష్ సానాను  ప్రశ్నించాలని భావిస్తే అలోక్ వర్మ  అలా చేయకూడదని కోరాడని  చెప్పారు.

సంబంధిత వార్తలు

రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు