ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థకు చెందిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని 10, 11 ఫ్లోర్లలోని వివిధ ఛాంబర్లలో సోదాలు జరుపుతున్నారు. ఆస్థానా, దేవేందర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఛాంచర్లలో తనిఖీలు చేస్తున్నారు.

కొత్త డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో డాక్యుమెంట్లు, ఫైల్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా తన కార్యాలయంలో తనే సోదాలు జరుపుకుంటోంది సీబీఐ.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాల ఆధిపత్య పోరు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ దశాబ్ధాలుగా సంపాదించిన ఘనతకు మచ్చ వచ్చింది.

ఈ నేపథ్యంలో సీబీఐకి చెడ్డ పేరు తెచ్చారంటూ కేంద్రప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధాని మోడీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో అలోక్ వర్మ, రాకేశ్‌లను సెలవుపై పంపిన కేంద్రం.. ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది.

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు