Asianet News TeluguAsianet News Telugu

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

 మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ మనీ లాండరింగ్ కేసును  సెటిల్ చేసేందుకు  టీడీపీ ఎంపీ సీఎం రమేష్  పేరు ప్రస్తావనకు రావడం ప్రస్తుతం రాజకీయంగా టీడీపీకి ఇబ్బందిగా మారింది. 

Poll jolt for TD  MPs name in graft trail
Author
Hyderabad, First Published Oct 23, 2018, 12:37 PM IST

అమరావతి:  మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ మనీ లాండరింగ్ కేసును  సెటిల్ చేసేందుకు  టీడీపీ ఎంపీ సీఎం రమేష్  పేరు ప్రస్తావనకు రావడం ప్రస్తుతం రాజకీయంగా టీడీపీకి ఇబ్బందిగా మారింది. 

మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీ మనీలాండరింగ్ కేసును నీరుగార్చేందుకు సీబీఐ  అత్యున్నత అధికారి ఒకరు  రూ. 2 కోట్లు లంచం తీసుకొన్నారని ఆరోపణలు వచ్చాయి.ఈ విషయమై మరో సీబీఐ అత్యున్నత అధికారి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.  ఈ విషయమై ఎఫ్ఐఆర్ కూడ నమోదైంది.

ఈ కేసులో మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి మద్దతుగా సతీష్ సానా రంగంలోకి దిగినట్టుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఆగష్టు 24వ తేదీన హైద్రాబాద్‌కు చెందిన సతీష్ సానా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను  సీబీఐ స్పెషల్  డైరెక్టర్  రాకేష్ ఆస్థానా కేంద్ర కేబినెట్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు.

సీబీఐ ఉన్నతాధికారి ఒకరు.. మొయిన్ ఖురేషీ కేసును నీరుగార్చేందుకు  టీడీపీ ఎంపీ సీఎం రమేష్  ద్వారా   ప్రయత్నాలు సాగించారని.... ఈ మేరకు  సతీష్ సామా సీఎం రమేష్‌తో చర్చించారని ఆ ఫిర్యాదులో  పేర్కొన్నారు.

ఈ కేసులో  ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. మధ్యవర్తి ద్వారా లంచం రూపంలో  రూ. 2 కోట్లను అడ్వాన్స్‌గా తీసుకొన్నారని సీబీఐ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తో పాటు  సతీష్ సానా కీలకంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపిస్తోంది. 

ఇదిలా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన సతీష్ సానాను అరెస్ట్ చేసి విచారణ చేయాలని భావించారు. ఈ మేరకు అనుమతి కోసం సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ వద్దకు ఫైల్ ను పంపారు. అయితే ఈ ఫైల్ ను అలోక్ వర్మ తన వద్దే ఉంచుకొన్నాడు.

ఈ విషయం ఉప్పందుకొన్న సతీష్ సానా సెప్టెంబర్ 25వ తేదీన దుబాయ్‌కు పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ, ఎయిర్‌పోర్ట్‌ల్లో లుకౌట్ నోటీసు జారీ చేయడంతో  సతీష్ తప్పించుకొనే పరిస్థితి లేకుండాపోయింది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27వ తేదీన సతీష్ సానా టెలిఫోన్‌లో ఈ కేసు విచారణ అధికారితో ఫోన్‌లో మాట్లాడాడు. తనపై ఎందుకు లుకౌట్ నోటీసును జారీ చేశారని ప్రశ్నించారని  సమాచారం.


కేసు విచారణలో పాల్గొనాల్సిందిగా విచారణాధికారి సతీష్ సానాకు ఫోన్ లో చెప్పారు. ఈ ఏడాది పిబ్రవరి 21 నుండి  విచారణకు ఎందుకు హాజరు కాలేదనే విషయాన్ని ఆయన ప్రశ్నించారు.

దీంతో  సతీష్ సానా  విచారణ అధికారి ముందు ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన హాజరయ్యారు.  ఈ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో  టీడీపీ ఎంపీ  ద్వారా సీబీఐ డైరెక్టర్‌ను మేనేజ్ చేసినట్టుగా స్టేట్ మెంట్ ఇచ్చారని సీబీఐ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.

ఆ మరునాడే అక్టోబర్ 4వ తేదీన ఈడీ అధికారుల ఎదుట సతీష్ హాజరయ్యారు. అక్టోబర్ 4 నుండి 15వ తేదీ వరకు ఈడీతో పాటు ఎంపిక చేసిన సీబీఐ అధికారుల కనుసన్నల్లో సతీష్ పనిచేశారని సీబీఐ గుర్తించింది. సతీష్ ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా  కేసు నమోదు చేసినట్టు కనుగొన్నారు.

ఇదిలా ఉంటే మాంసం వ్యాపారి మొయిన ఖురేషీ కేసును నీరుగార్చేందుకు సీబీఐ ఉన్నతాధికారిని తాను మేనేజ్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా వస్తున్న వార్తలను టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఖండిస్తున్నారు.ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన ప్రకటించారు.

సంబంధిత వార్తలు

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

సిబిఐలో అంతర్యుద్ధం: సిఎం రమేష్ పాత్ర ఏమిటి?

సీబీఐలో కుమ్ములాట: రంగంలోకి దిగిన ప్రధాని మోడీ

సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్

Follow Us:
Download App:
  • android
  • ios