ఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మల, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాకేష్ ఆస్థానాను అరెస్ట్ చేయవద్దంటూ ఉత్తర్వులు జారీచేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని సీబీఐని ఆదేశించింది. 

అలాగే కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ భద్రపరచాలని సీబీఐకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్‌ను పరిశీలించిన ధర్మాసనం స్వల్ప ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్  రాకేష్ ఆస్థానా మధ్య ప్రచ్ఛన్నయుద్దం సాగుతోంది.  ఒకరిపై మరోకరు బహిరంగంగానే విమర్శలు చేసుకొన్నారు. దీంతో ప్రధానమంత్రి మోడీ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరు సీనియర్ అధికారులు  సోమవారం  మోడీని కలిశారు.  

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మల,  స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ కోసం  సీబీఐ డైరెక్టర్  రూ. 2 కోట్లు తీసుకొన్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చేస్తోంది. దీంతో డైరెక్టర్ , స్పెషల్ డైరెక్టర్లు బహిరంగంగానే విమర్శలు చేసుకొంటున్నారు.  

 

ఈ వార్తలు కూడా చదవండి

సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్

సీబీఐలో కుమ్ములాట: రంగంలోకి దిగిన ప్రధాని మోడీ