న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐలో రాత్రికి రాత్రే మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు వెలువడిన ఉత్తర్వులు మొత్తం పరిస్థితినే మార్చేశాయి. సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీకి మధ్య చెలరేగిన వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీ వేగంగా స్పందించి చర్యలకు శ్రీకారం చుట్టారు. 

సిబిఐ నియంత్రణ సంస్థ అయిన విజిలెన్స్ విభాగం కమిషనర్ కెవి చౌదరి రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోడీకి సిపిఐ తీరుపై నివేదిక సమర్పించారు. ఆ నివేదిక మేరకు సిపిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను, డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ అస్థానాను తప్పనిసరి సెలవుపై పంపించేశారు. 

ఇరువురి మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ప్రధాని కార్యాలయం (పిఎంవో) జోక్యం చేసుకుని నివేదిక సమర్పించాల్సిందిగా చౌదరిని అడిగింది. తనపై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లిన ఆస్థానాను మంగళవారంనాడే సెలవుపై పంపించేశారు. ఆ తర్వాత అర్థరాత్రి ప్రధాని నేతృత్వంలోని నియామక కమిటీ విజిలెన్స్ చీఫ్ నివేదిక ఆధారంగా ఇద్దరిని కూడా సెలవుపై వెళ్లాలని ఆదేశించి, తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వర రావును నియమించింది. 

దాంతో కార్యాలయంలోకి ఆలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాల ప్రవేశాన్ని నిరోధించారు. వారి ఇద్దరి డ్రైవర్లను కూడా ఉపసంహరించారు. సిబిఐ కేంద్ర కార్యాలయాలను సీల్ చేసి సోదాలను ప్రారంభించారు. బుధవారం తెల్లవారు జామున నాగేశ్వర రావు తాత్కాలిక డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. 

సిబిఐ డైరెక్టర్ట కార్యాలయంలో, డిప్యూటీ డైరెక్టర్ కార్లాయంలో అధికారుల కదలికలను, ఫైళ్ల మార్పిడిని ఆపేశారు. మరికొంత మంది అధికారులను కూడా సెలవుపై పంపించేశారు.

సంబంధిత వార్తలు

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు