సీబీఐ  బాస్‌ల అంతర్యుద్ధంలో సతీష్ సానా పేరు కీలకంగా విన్పిస్తోంది.  సీబీఐ కేసుల్లో  సతీష్ సానా కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు.  

హైదరాబాద్: సీబీఐ బాస్‌ల అంతర్యుద్ధంలో సతీష్ సానా పేరు కీలకంగా విన్పిస్తోంది. సీబీఐ కేసుల్లో సతీష్ సానా కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు. 

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ భూముల కేసు కూడ ఉంది. ఉమ్మడి ఏపీలో ఈ కేసు నమోదైంది.ఈ కేసు విషయంలో కూడ సతీష్ పేరు ప్రముఖంగా విన్పించింది. ఆ తర్వాత పలు కేసుల సందర్భంగా కూడ బయటకు వచ్చినట్టు ప్రచారంలో ఉంది.తాజాగా ఇద్దరు సీబీఐ బాస్‌ల అంతర్యుద్దంలో కూడ సతీష్ పేరు తాజాగా వెలుగు చూసింది.

మాంసం ఎగుమతి వ్యాపారి మొయిన్ ఖురేషీ మనీ లాండరింగ్ కేసులో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఒప్పందం కుదుర్చుకొన్నాడని సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా కేబినెట్ సెక్రటరీ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పాత్ర కూడ ఉందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆస్థానాకు వ్యతిరేకంగా అక్టోబర్ 15వ తేదీన సీబీఐ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఈ కేసును నీరుగార్చేందుకు గాను రూ. 2 కోట్లు అడ్వాన్స్‌ను దుబాయ్ కు చెందిన మధ్యవర్తుల ద్వారా సతీష్ సానా ప్రయత్నించారని ఈ ఫిర్యాదులో ఉంది.

ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని వాన్‌పిక్ కేసులో కూడ సతీష్ సానా పేరు ఉంది. వాన్‌పిక్ చార్జీషీట్‌లో ఖురేషీతో బ్లాక్ బెర్రీ మేసేంజర్ ద్వారా సతీష్ టచ్‌లో ఉన్నాడని సీబీఐ చార్జీషీట్‌లో పేర్కొంది.

వాన్‌పిక్ కేసును పరిష్కరించేందుకు గాను ఖురేషీకి సతీష్ సానా రూ.50 లక్షలను చెల్లించినట్టు సమాచారం.అయితే సీబీఐ చేసిన ఆరోపణలను సతీష్ ఖండించారు. పెట్టుబడి కోసం మాత్రమే తాను ఖురేషీకి ఈ డబ్బులను చెల్లించినట్టుగా చెప్పారని అప్పట్లో ప్రచారంలో ఉంది.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు చెందిన కొన్ని సంస్థల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త
నిమ్మగడ్డ ప్రసాద్‌కు వాన్‌పిక్ భూములు 22 వేల ఎకరాలను కేటాయించారు. ఈ భూ కేటాయింపుల విషయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని ఆరోపించారు.

గుంటూరు - ప్రకాశం జిల్లాల మధ్య ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం ఈ భూములను కేటాయించారు. మ్యాట్రిక్స్ నేచురల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్‌కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ గోదావరి బ్రేవరీజేస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలకు సతీష్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఈ కంపెనీల్లో శ్రాస్ మేరైన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం ఈ ఫైలింగ్ మాత్రం చేయలేదు. మిగిలిన కంపెనీలన్నీ ఈ ఫైలింగ్ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

తండ్రి మరణం తర్వాత కాకినాడలో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చేరారు. అదే సమయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ‌లో కూడ చేరారు. క్రికెట్ అసోసియేషన్‌లో చేరిన సమయంలోనే చాముండేశ్వరీనాథ్‌తో సతీష్ సానాకు పరిచయం ఏర్పడింది.

ప్రస్తుత నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాధ్యతల నుండి తప్పుకొన్న తర్వాత ఈ బాధ్యతలను సతీష్ సానా స్వీకరించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రారావు, సినీ నటుడు చిరంజీవితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సతీష్ అప్పట్లో చెప్పుకొనేవాడు.

తెలంగాణ బాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎంవీ చాముండేశ్వరీనాథ్ గోల్డ్ కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయం నుండి సతీష్ సానాతో తనకు పరిచయం ఉందని చాముండేశ్వరీనాథ్ చెబుతున్నారు పదేళ్ల క్రితం నుండే సతీష్ సానా తూర్పు గోదావరి జిల్లా నుండి తన నివాసాన్ని హైద్రాబాద్‌కు మార్చాడు.

సంబంధిత వార్తలు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

సిబిఐలో అంతర్యుద్ధం: సిఎం రమేష్ పాత్ర ఏమిటి?

సీబీఐలో కుమ్ములాట: రంగంలోకి దిగిన ప్రధాని మోడీ

సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్