సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా  తెలంగాణకు చెందిన ఎం. నాగేశ్వరరావు నియమితులయ్యారు.

హైదరాబాద్: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలంగాణకు చెందిన ఎం. నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు సీబీఐ జాయింట్ డైరెక్టర్ నుండి తాత్కాలిక డైరెక్టర్ గా మంగళవారం అర్ధరాత్రి బాధ్యతలను చేపట్టారు.

వరంగల్ జిల్లాలోని సామాన్య వ్యవసాయ కుటుంబానికి చెందిన మన్నం పిచ్చయ్య, శేషమ్మల రెండో సంతానం నాగేశ్వరరావు. నాగేశ్వరరావుకు ఓ అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మంగపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు ఆయన తిమ్మంపేటలోనే చదివాడు.

వరంగల్‌లోని ఏవీవీ జూనియర్ కాలేజీ ఇంటర్ చదివిన తర్వాత సీకేఎం డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉస్మానియాలో పీజీ చేస్తున్న సమయంలోనే 1986లో సివిల్స్ రాసి ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. ఒడిశా కేడర్‌లో ఐపీఎస్‌గా చేరినా ఎక్కువగా కాలం ఛత్తీస్‌ఘడ్‌లో పనిచేశాడు. ఒడిశా డీజీపీగా పనిచేస్తున్నాడు.

గతంలో దక్షిణాది రాష్ట్రాల సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణ స్థానంలో నాగేశ్వరరావుకు బాధ్యతలను అప్పగించారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావును మంగళవారం రాత్రి డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య అంతర్యుద్ధం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిద్దరిని సెలవుపై పంపి.. ఎం. నాగేశ్వరరావుకు బాధ్యతలను అప్పగించారు.

సంబంధిత వార్తలు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు