కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.  ఆయన కనిపించకుండా పోయారు అన్న వార్త రాగానే... ఆయన కంపెనీ కేఫ్ కాఫీ డేకి  చెందిన షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. మంగళవారం వారి కంపెనీకి చెందిన సికాల్ లాజిస్టిక్స్ షేర్లు 20శాతం పడిపోయాయి.

వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోగా... ఈ ప్రభావం షేర్లపై పడిందని అధికారులు చెబుతున్నారు. బీఎస్ఈలో కాఫీడే ఎంటర్ ప్రైజెస్, సికాల్ లాజిస్టిక్స్ షేర్లు రోజువారీ గరిష్ట పరిమితి 20శాతం తగ్గి రూ.154.05, రూ.72.80కి చేరుకున్నాయి. షేర్లు ఇలా పడిపోవడంపై కాఫీడే ఎంటర్ ప్రైజెస్ మంగళవారం స్పందించింది.

‘‘ మేము సంబంధిత అధికారుల సహాయం తీసుకుంటున్నాం. కంపెనీ వృత్తిపరంగా నిర్వహణ జరుగుతుంది. త్వరలోనే సమర్థమైన న్యాయకత్వ బృందాన్ని ఎంపిక చేస్తాం’ అని వారు తెలిపారు. 

సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయి వార్తల్లోకి ఎక్కిన సిద్థార్థ... కొద్దిరోజుల క్రితం కూడా వార్తల్లో నిలిచారు. ప్రముఖ టెక్ కంపెనీ మైండ్ ట్రీలోని 20శాతం తన వాటాను సిద్ధార్థ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ లారెన్స్ అండ్ టూబ్రో సంస్థకు విక్రయించారు. అంతేకాకుండా కోకాకోలా కంపెనీతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

2017 సెప్టెంబర్ లో సిద్ధార్థకు  చెందిన కంపెనీల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. సిద్ధార్థ కుటుంబం 130 సంవత్సరాలుగా ఈ కాఫీ గ్రోయింగ్ వ్యాపారంలో భాగస్వామ్యులుగా ఉండటం విశేషం.

related news

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..