కేఫీ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్య సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ అల్లుడైన సిద్ధార్థ.. ఎన్నో సంవత్సరాలుగా ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతూ వస్తున్నారు. గత కొంతకాలంగా వ్యాపారంలో లాభాలు గడించడంలేదనే డిప్రెషన్ గురైన ఆయన... బోర్డ్ సభ్యులకు లేఖ రాశి కనిపించకుండా పోయారు.

మంగళూరులోని నేత్రావతి నది వద్దకు సోమవారం సాయంత్రం డ్రైవర్ తో కలిసి వెళ్లిన ఆయన అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కోసం నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

నేత్రావతి నది వద్ద ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వెళుతూ... డ్రైవర్ ని అక్కడే ఉండమని చెప్పినట్లు సమాచారం. నది వెంబడి నడుచుకుంటూ వెళ్లిన ఆయన తిరిగి ఎంతసేపైనా వెనక్కి రాకపోవడంతో... డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. కాగా... సిద్ధార్థ కనిపించకుండా పోవడానికి ముందు చివరిసారిగా.. ఎవరితో ఫోన్ మాట్లాడారు అనే విషయంపై పోలీసులు దృష్టిసారించారు.

ప్రస్తుతం పోలీసులు ఆయన కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. సిద్ధార్థ ఎవరితో మాట్లాడారో... ఏం మాట్లాడారో తెలిస్తే ఈ  కేసులో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆయన బోర్డు సభ్యులకు రాసిన లేఖ ఆధారంగా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

related news

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...