Asianet News TeluguAsianet News Telugu

విషాదాంతం: నేత్రావతిలో శవమై తేలిన కాఫీ డే అధినేత సిద్ధార్ధ్

కేఫ్ కాపీ డే యజమాని వీజీ సిద్దార్ధ మృతదేహం నేత్రావతి నదిలో బుధవారం నాడు ఉదయం లభ్యమైంది.రెండు రోజుల క్రితం సిద్దార్ధ అదృశ్యమయ్యారు.

vg siddarha dead body found in netravathi river
Author
Bangalore, First Published Jul 31, 2019, 7:15 AM IST

కేఫ్ కాపీ డే యజమాని వీజీ సిద్దార్ధ మృతదేహం నేత్రావతి నదిలో బుధవారం నాడు ఉదయం లభ్యమైంది.రెండు రోజుల క్రితం సిద్దార్ధ అదృశ్యమయ్యారు. 

సోమవారం రాత్రి ఏడు గంటలకు సిద్దార్ధ నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జిపై కారు దిగారు. కారును నేత్రావతి నది బ్రిడ్జిపై నడుచుకొంటూ వెళ్లి అదృశ్యమయ్యాడు.కారు డ్రైవర్ గంటసేపటివరకు ఎదరుచూసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఈ సమాచారం ఆధారంగా పోలీసులు నేత్రావతి నదిలో గాలించారు. బుధవారం నాడు ఉదయం నేత్రావతి నదిలో వీజీ సిద్దార్ధ మృతదేహం లభ్యమైంది.నేత్రావతి నదిలోకి బ్రిడ్జి నుండి ఓ వ్యక్తి దూకడం చూసినట్టుగా మత్స్యకారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బ్రిడ్జి వద్ద ఉన్న 8వ పిల్లర్ వద్ద ఓ వ్యక్తి నదిలోకి దూకడం చూసినట్టుగా మత్స్యకారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఈ సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

అదే ప్రాంతంలో సిద్దార్ధ మృతదేహం లభ్యమైంది. సోమవారం నుండి మంగళవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నాడు గాలింపు చర్యలు చేపట్టిన కొద్దిసేపటికే సిద్దార్ద మృతదేహం లభ్యమైంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే సిద్దార్ధ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...

Follow Us:
Download App:
  • android
  • ios