Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం

పోర్న్‌ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించింది

Block 827 porn websites: DoT asks Internet providers
Author
Hyderabad, First Published Oct 25, 2018, 3:27 PM IST

భారత్ లో పోర్న్ వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దేశమంతా 827 పోర్న్‌ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించింది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం మొత్తం 857 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని పేర్కొనగా.. అందులో 30 సైట్లలో ఎలాంటి అశ్లీల కంటెంట్‌ లేదని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ గుర్తించినట్లు తెలిపారు. బ్లాక్‌ చేయాల్సిన మొత్తం 827 వెబ్‌సైట్ల జాబితాను టెలికామ్‌ విభాగానికి అందజేసినట్లు పేర్కొన్నారు.

అశ్లీల వెబ్‌సైట్‌ల నిలిపివేత తక్షణం అమలులోకి రావాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఇచ్చిన ఉత్తర్వుల్లో టెలికామ్‌ విభాగం పేర్కొంది. 857 అశ్లీల వెబ్‌సైట్లను నిలిపివేయాలని సెప్టెంబరు 27న ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios