ఆర్యన్ ఖాన్ కు బెయిల్.. శనివారం వరకు జైల్ లోనే...
బాలీవుడ్ బాద్ షా Shah Rukh Khan కొడుకు అయిన ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 8 నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే ఉన్నాడు. ఇప్పటికి రెండుసార్లు బెయిల్ నిరాకరించబడింది.
న్యూఢిల్లీ : డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో అరెస్టయిన మూడు వారాల తర్వాత సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరైంది. గురువారం బాంబే హైకోర్టు అధికారిక ఉత్తర్వు తర్వాత మాత్రమే అతని బృందం అతని విడుదల కోసం దరఖాస్తు చేసుకోగలదు.. కాబట్టి బెయిల్ మంజూరైనా శనివారం వరకు జైలులోనే ఉంటాడు.
అక్టోబర్ 3న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఆర్యన్ ఖాన్ ను అదుపులోకి తీసుకుంది. క్రూయిజ్ షిప్ పార్టీపై డ్రగ్స్ దాడులు చేసిన కొద్ది గంటల తర్వాత Aryan Khanను అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ బాద్ షా Shah Rukh Khan కొడుకు అయిన ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 8 నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే ఉన్నాడు. ఇప్పటికి రెండుసార్లు బెయిల్ నిరాకరించబడింది.
ఆర్యన్ ఖాన్ తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మోడల్ మున్మున్ ధమేచాకు కూడా బెయిల్ మంజూరైంది. ఆర్యన్‌ఖాన్‌పై మాజీ అటార్నీ జనరల్, ఆర్యన్‌ఖాన్ న్యాయవాది ముకుల్ రోహత్‌గీ వాదిస్తూ అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అరెస్ట్ చేయడానికి గల కారణాలు సన్నగిల్లుతున్నాయని కోర్టులో వాదించారు.
అయితే, ఆర్యన్ ఖాన్ conspiracyలో భాగమని, అతని వాట్సాప్ చాట్‌లు అక్రమ మాదకద్రవ్యాల లావాదేవీలలో అతని ప్రమేయాన్ని వెల్లడించాయని NCB పేర్కొంది.
Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై ఆర్జీవీ, సోనూసూద్.. ఇతర సెలెబ్రిటీల రియాక్షన్..!
ఆర్యన్‌ఖాన్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాకపోవడం, ఆర్యన్ డ్రగ్స్ వాడిన ఆనవాళ్లు లేకపోయినా.. అతడిని నిర్బంధించడం న్యాయమా అనే చర్చకు ఈ కేసు తెరలేపింది. సోషల్ మీడియాలో ఆర్యన్ కు మద్దతుగా మెసేజ్ లతో నిండిపోయింది, చాలామంది అరెస్టును witch-huntగా పిలుస్తున్నారు.
ఆర్యన్ ఖాన్ తండ్రి షారుఖ్ ఖాన్, (55), భారతదేశపు సూపర్ స్టార్, అందరూ ఎంతో ఇష్టపడే సినీ నటులలో ఒకరు. ఖాన్‌ల ముంబయి ఇల్లు, "మన్నత్" ముందు ఒక్కసారి షారుఖ్ ను చూడాలని వేచి ఉండే అభిమానులతో ఎప్పుడూ నిండిపోయి కనిపిస్తుంటుంది. ముఖ్యంగా షారుఖ్ పుట్టినరోజు నవంబర్ 2 నాడు అభిమానులు వెల్లువెత్తుతారు.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ మీద గత కొన్ని వారాలుగా, అనేక మంది సంఘీభావం ప్రకటించారు. ఆర్యన్ కోసం పోస్టర్లు, మెసేజ్ లు సందేశాలను పట్టుకుని సంఘీభావం తెలుపుతున్నారు. సల్మాన్ ఖాన్, ఫరా ఖాన్, హృతిక్ రోషన్‌తో పాటు, మరికొందరు బహిరంగంగా షారుఖ్ కు తమ మద్దతును ప్రకటించారు.
రెండుసార్లు బెయిల్ తిరస్కరించబడడంతో ఆర్యన్ ఖాన్ కేసును.. బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. రోహత్గీ అరెస్ట్ తప్పు అని, రాజ్యాంగ హామీలను ఉల్లంఘించారని అన్నారు. ఆర్యన్‌పై కేసు పూర్తిగా రెండేళ్ల వాట్సాప్ చాట్‌లపై నిర్మించబడిందని, అవి "సంబంధం లేనివి" అని, క్రూయిజ్‌తో ఎటువంటి సంబంధం లేదని Mukul Rohatgi కోర్టుకు చెప్పాడు.
"వీళ్లు చిన్నపిల్లలు. వారిని rehabకి పంపొచ్చు. అంతేకానీ, వారు విచారణకు ఎదుర్కోవలసి అవసరం లేదు" అని రోహత్గి వాదించారు.
గత వారం అతనికి బెయిల్ నిరాకరించిన సందర్భంలో ప్రత్యేక మాదక ద్రవ్యాల నిరోధక కోర్టు.. ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ షూలో దాచిన చరస్ గురించి ఆర్యన్ కు తెలుసునని, ఇది "conscious possession" అని పేర్కొంది.
ఫలించిన 23 రోజుల నిరీక్షణ.. ఆర్యన్ ఖాన్‌కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్ట్
మిస్టర్ రోహత్గీ ఈ అభిప్రాయాన్ని చాలా వింతగా పేర్కొన్నారు. "అర్బాజ్ షూలో దొరికిన వాటిపై నాకు నియంత్రణ లేదు. conscious possession అనే ప్రశ్న లేదు. అర్బాజ్ నా సేవకుడు కాదు, అతను నా కంట్రోల్ లో లేడు" అని అతను చెప్పాడు.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కు రెగ్యులర్ వినియోగదారుడని.. అతని వాట్సాప్ చాట్‌లు కమర్షియల్ క్వాంటిటీలో "హార్డ్ డ్రగ్స్" సేకరించడాన్ని సూచిస్తున్నాయని గురువారం, anti-drugs agency పేర్కొంది.
"ఈ కేసులో నంబర్ 1 నిందితుడైన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగించడం మొదటిసారే కాదు" అని NCBన్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అన్నారు.
"అతను గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ ను వాడుతున్నాడు. డ్రగ్స్ సేకరిస్తున్నాడు. వాణిజ్య పరిమాణంలో డ్రగ్స్ సేకరిస్తున్నట్లు రిఫరెన్స్ ఉంది. ఆ డ్రగ్స్ కూడా hard drugs. అతనికి పెడ్లర్లతో పరిచయం కూడా ఉంది" అని సింగ్ చెప్పారు.
ఏ ప్రాతిపదికన అతను "commercial quantity"లో వ్యవహరిస్తున్నట్లు ఏజెన్సీ గుర్తించిందో చెప్పాలని న్యాయమూర్తి అడిగినప్పుడు, NCB అతని WhatsApp చాట్‌లను ప్రస్తావించింది.
"వాట్సాప్ చాట్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. అతను కమర్షియల్ క్వాంటిటీలో డీల్ చేసే చేసాడు. అంతే కాదు, ఓడలో వాటిని పట్టుకున్నప్పుడు, మొత్తం ఎనిమిది వద్ద రకరకాల డ్రగ్స్ దొరికాయి. ఇది యాదృచ్చికం కాదు. ఔషధ పరిమాణం, స్వభావం యాదృచ్చికం కాదు," అని సింగ్ అన్నారు.
ఈ క్రూయిజ్‌లో 1,300 మంది ఉన్నారని రోహత్గీ కౌంటర్ ఇచ్చారు. "తాజ్‌లో 500 గదులు ఉన్నాయి. రెండు గదుల్లో ఇద్దరు వ్యక్తులు తింటుంటే మీరు మొత్తం హోటల్‌ను పట్టుకుంటారా? ఇది కేవలం కుట్ర కోసం తప్ప, వేరే ఏమీ లేదు," అని అతను చెప్పాడు.
డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ విచారణకు నాయకత్వం వహిస్తున్న అధికారి సమీర్ వాంఖడే నార్కోటిక్స్ బ్యూరోలో అంతర్గత విచారణను ఎదుర్కొంటున్నారు. మరొకరు ఈ కేసుకు సంబంధించిన లంచం, దోపిడీ ఆరోపణలపై ముంబై పోలీసులచే అంతర్గత విచారణను ఎదుర్కొంటున్నారు.