షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై బాలీవుడ్ అంతా ఆసక్తిగా చూస్తున్నది. బాంబే హైకోర్టు బెయిల్‌కు అనుమతించడంతో పలువురు సెలబ్రిటీలు వారి తరహాలో రియాక్షన్ ఇచ్చారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, యాక్టర్ సోనూసూద్, మాధవన్, ఇతర ప్రముఖులు స్పందనలు ఇలా ఉన్నాయి. 

ముంబయి: బాలీవుడ్ బాద్ షా Shah Rukh Khan తనయుడు Aryan Khanకు ఎట్టకేలకు Bail లభించింది. క్రూజ్ డ్రగ్స్ కేసులో Bombay High Court ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. రేపటిలోగా బెయిల్ ఆదేశాలు వెలువడవచ్చు. ఈ ఆదేశాలు రాగానే జైలు నుంచి వీరు విడుదల కానున్నారు. 23 రోజులపాటు జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ విడుదల కానుండటంతో పలువురు సెలెబ్రిటీలు స్పందించారు. అందులో వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు.

ఆర్యన్ ఖాన్‌కు బెయిల్‌ను బాంబే హైకోర్టు ఆమోదించిన తర్వాత ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు Sonu Sood ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. ‘కాలం న్యాయం చెప్పినప్పుడు సాక్షుల అవసరం పడదు’ అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశారు.

Also Read: ఫలించిన 23 రోజుల నిరీక్షణ.. ఆర్యన్ ఖాన్‌కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్ట్

స్వరా భాస్కర్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ఆర్యన్ ఖాన్ సహా మరో ఇద్దరికి బెయిల్ లభించిందని పేర్కొన్న ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఫైనల్లీ అని పేర్కొన్నారు. ఇదే వరుసలో రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు.

ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలే దోహదపడితే.. ఇంతకు ముందు వాదించిన న్యాయవాదుల్లో పస లేదా? వారిని నమ్ముకుని ఇన్ని రోజులు ఆర్యన్‌ను అనవసరంగా జైలుకే పరిమితమయ్యాడా? అంటూ ట్వీట్ చేశారు. ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసిన తర్వాత కూడా ఆర్జీవీ స్పందించారు. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ పబ్లిసిటీ ఇస్తున్నదన్నట్టుగా RGV అభిప్రాయపడ్డారు.

ఆర్యన్ ఖాన్ అరెస్టు తర్వాత పిల్లాడిని ఇబ్బంది పెడుతున్నారే? అన్నట్టుగా కొందరు స్పందించారు. షారూఖ్ ఖాన్‌కు అండగా వారు వ్యాఖ్యలు చేశారు. అయితే, వీరికి విరుద్ధంగా ఇంకొందరు వాదించారు. అతనికి 20ఏళ్లు పైబడ్డాయని, ఆర్యన్ ఖాన్ పిల్లాడేమీ కాదని వాదనలు చేశారు. ఇదే సందర్భంలో మాధవన్ కుమారుడినీ ప్రస్తావించారు. అదే వయసులో ఉన్న మాధవన్ తనయుడు ఎన్ని మెడల్స్ సాధించాడో చూడండి అంటూ దాడిని తీవ్రం చేశారు. ఈ నేపథ్యంలో మాధవన్ కూడా ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై స్పందించారు.

‘థాంక్ గాడ్.. ఒక తండ్రిగా నేను కుదుటపడ్డాను. అన్ని మంచి శకునాలే జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

Also Read: ఔను.. సమీర్ వాంఖడే బ్లాంక్ పేపర్స్‌పై నా సంతకాలూ తీసుకున్నాడు.. మరో సాక్షి ఆరోపణలు

ఆర్యన్ ఖాన్‌తో చిన్నప్పటి ఫొటోనూ షేర్ చేసి ఆయన బెయిల్‌ను శనయ కపూర్ సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ సింగర్ మికా సింగ్ స్పందిస్తూ ఆర్యన్ ఖాన్‌కు కంగ్రాట్స్ తెలిపారు. భగవంతుడి ఇంట్లో కాస్త ఆలస్యముంటుందేమో కానీ చీకటి ఉండదు సోదరుడా అంటూ షారూఖ్ ఖాన్‌ను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు.

ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా కూడా స్పందించారు. ఈ రోజు రాత్రి మంచి వేడుక చేసుకోవాలనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ సెలెబ్రిటీలపై వేధింపులపై హన్సల్ మెహతా ఇటీవలే మండిపడ్డారు. ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కూడా. బాలీవుడ్ నటి మలైకా అరోరా ఆర్యన్ ఖాన్ బెయిల్ పై స్పందిస్తూ దేవుడికి ధన్యవాదాలు తెలిపారు.