మధ్యప్రదేశ్‌లో సంచలనం కలిగించిన ఆవుపై అత్యాచారం చేసిన నిందితుడిని భోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న మధ్యప్రదేశ్‌ సుందర్‌నగర్ ప్రాంతంలోని పశువుల పాడిలోకి షబ్బీర్ అలీ అనే 55 ఏళ్ల వ్యక్తి చొరబడ్డాడు. అనంతరం అక్కడి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు లేని విధంగా ఆవు విపరీతంగా రోదిస్తుండటంతో ఇంటి యజమాని అక్కడికి వెళ్లి చూడగా, నిందితుడు పరారయ్యాడు.

అనుమానం వచ్చిన ఆయన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. షబ్బీర్ ఆవుపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై అశోక్ గార్డెన్ పోలీస్  స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.