Asianet News TeluguAsianet News Telugu

‘మరణించిన మాతోటి వారి డెడ్‌బాడీలను తినడం తప్పనిపించలేదు’.. 1972 ఫ్లైట్ క్రాష్‌ నుంచి బతికినవారి స్టోరీ ఇది

1972లో ఆండీస్ పర్వతాల్లో ఫ్లైట్ క్రాష్‌లో కొంత మంది.. మంచుతుఫాన్‌తో మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ ఊపిరితో ఉన్నవారు సహాయం కోసం 72 రోజులు ఎముకలు కొరికే చలిలో ఎదురుచూశారు. అక్కడ 72 రోజులు జీవించడం సవాల్‌గా మారింది. ఆ క్రాష్ బయటపడ్డ వారు 50 ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకుని ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు.
 

1972 andes plane crash survivors had to eat friends deadbodies.. horrific details here
Author
First Published Oct 19, 2022, 6:27 PM IST

న్యూఢిల్లీ: ఆండీస్ పర్వతాల మీదుగా వెళ్లుతున్న ఫ్లైట్ కఠిన వాతావరణం వల్ల క్రాష్ అయింది. ఎముకలు కొరికే చలి. ఆకాశమంతా దట్టమైన మంచుపొగే. కనీసం రెస్క్యూ చేయడానికి వచ్చిన వారికీ బాధితులు కనిపించే అవకాశాలు చాలా తక్కువ. ఫ్లైట్ క్రాష్‌లో 29 మంది ప్రయాణికులు మరణించారు. మరో మూడు వారాల తర్వాత ఇంకొ 13 మంది పెద్ద మంచు తుఫాన్‌తో ఊపిరిలొదిలారు. ఆ ఫ్లైట్‌(ఉరుగ్వేయన్ ఎయిర్ ఫోర్స్-ఫ్లైట్ 571) క్రాష్ తర్వాత ప్రాణాలతో ఉన్నది మరో 16 మంది మాత్రమే. కానీ, వారు సహాయం కోసం రోజుల తరబడి ఎదురుచూశారు. రోజు రోజుకూ ఒంట్లో సత్తువ నిండుకుంటున్నది. కనుచూపు మేర మంచు పర్వతాలు మాత్రమే కనిపిస్తున్నవారికి తినడానికీ ఏమీ దొరకడం లేదు. ఇంకొన్ని రోజులు జీవిస్తే.. సహాయక బృందాలు కనిపించే వరకైనా ప్రాణాలతో జీవిస్తే.. తర్వాత ప్రాణాలు ఎలాగైనా నిలుస్తాయి. కానీ, అప్పటి వరకు జీవించేదెలా? 

రెస్క్యూ బృందాలు వచ్చే వరకూ ఎలాగైనా బతకాలి. ఏమి తినైనా బతకాలి అని ఆ 16 మంది అనుకున్నారు. వారికి కంటి ముందు విరిగిపడిన విమాన శిథిలాలు, అందులోని తమ మిత్రుల మృతదేహాలు మాత్రమే ఉన్నాయి. ఇక తప్పదు.. మనం ఇంకొన్ని రోజులు జీవించి ఉండాలంటే ఆ మృతదేహాల్లో కొన్ని బాగాలను కట్ చేసుకుని తినాల్సిందే అని మెడికల్ స్టూడెంట్ రాబర్టో కానెసా సూచించారు. ఆ సూచనకే అందరూ జంకారు. కానీ, గత్యంతరం లేదు. తమ మిత్రులే చచ్చి మమ్మల్ని బతికిస్తున్నారని తలిచారు. అద్దం ముక్కలతో వారి డెడ్ బాడీలోని పార్టులను కోసుకుని తిన్నారు. ఇది 50 ఏళ్ల కిందటి సంగతి.

ఉరుగ్వే నుంచి చిలీకి రగ్బీ ప్లేయర్లు, వారి మిత్రులు, కుటుంబాలతో బయల్దేరిన ఫ్లైట్ 1972లో ఆండీస్ పర్వతాల్లో క్రాష్ అయింది. 16 మంది మాత్రమే ఈ క్రాష్‌లో బతికిబట్టకట్టారు. 72 రోజులపాటు వారు తమ ప్రాణాలు నిలుపుకుని ఉంచుకోగలిగారు. చివరకు అదే ఏడాది డిసెంబర్ 23న వారిని రెస్క్యూ సిబ్బంది గుర్తించి కాపాడారు.

Also Read: కూతురిని జాగ్రత్తగా చూసుకో.. చివరిసారి ఫైలట్ తన భార్యకు ఫోన్ చేసి.. కుమార్తె ఆరోగ్యంపై ఆందోళన

50 ఏళ్ల సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 13 బతికినవారంతా కలిశారు. ప్రాణాలతో ఉండటానికి వారు ఏమేం చేయకతప్పలేదో మరోసారి గుర్తు చేసుకున్నారు.

రాబర్టో కానెసా తొలిసారి గ్లాస్ ముక్కను పట్టుకుని తమ ఫ్రెండ్స్ బాడీలను కోసి తినడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి కుటుంబాలకూ వెళ్లి వివరణ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. అప్పుడు తాను చనిపోవడం కూడా ఒక గౌరవంగా భావించానని, తద్వార ఇతరులు తినడానికి తాను ఉపయోగపడేవాడినని వివరించినట్టు ది ఇండిపెండెంట్ రిపోర్ట్ చేసింది. 

మరో సర్వైవర్ రామొన్ సాబెల్లా ది టైమ్స్‌తో మాట్లాడుతూ, మనుషుల దేహాలను తినే ఆలోచనల దారుణంగా అనిపించిందని, ఆ ముక్కలను నోట్లో పెట్టుకోవడం దుర్భరంగా ఉండేదని వివరించారు. కానీ, తాము తిన్నామని తెలిపారు. వారు ముందు చర్మాన్ని, కొవ్వును తిన్నారని, ఆ తర్వాత మాంసాన్ని, బ్రెయిన్‌ను తిన్నామని పేర్కొన్నారు. తాము జీవించి ఉండటానికి తమ మిత్రులే తొలి అవయవ దాతలుగా భావించినట్టు సాబెల్లా చెప్పారు.

Also Read: Nepal plane crash: భార్య‌భ‌ర్తలుగా విడిపోయినా.. మృత్యు ఒడిలోకి ఒక్క‌టిగా..

అంతేకాదు, ప్రాణాలతో ఉన్న ఆ 16 మంది కూడా ఒక ఒప్పందం చేసుకున్నారని, అందులో ఎవరు మరణించినా.. ఇతరులు వారిని తినాలనే ఒప్పందం పెట్టుకున్నట్టు వివరించారు.

ఫ్లైట్ క్రాష్‌లో సర్వైవర్స్ కోసం రెస్క్యూ చేపట్టారు. కానీ, దట్టమైన పొగమంచు వల్ల ఎవరినీ గుర్తించలేకపోయారు. తమను వెతకడాన్ని ఆపేశారని పది రోజుల తర్వాత బాధితులకు తెలిసింది. దుర్ఘటన జరిగిన రెండు నెలల తర్వాత బాధితులు ఇద్దరు కానెసా, పరాడోలు సహాయం కోసం పది రోజుల ప్రయాణం కట్టారు. వారు స్వయంగా తయారు చేసుకున్న స్లీపింగ్ బ్యాగ్, మనుషుల చర్మంతో చేసిన రగ్బీ సాక్స్ వెంటపెట్టుకెళ్లారు. 

చివరకు 1972 డిసెంబర్ 22న రెస్క్యూ బృందాలతో హెలికాప్టర్లు అక్కడికి వచ్చాయి. ఆ తర్వాతి రోజే వారిని సేఫ్‌గా తీసుకెళ్లారు. ఈ ఘటనపై పుస్తకం(అలైవ్: ది స్టోరీ ఆప్ ఆండీస్ సర్వైవర్స్) వచ్చింది. హాలీవుడ్‌లోనూ 1993లో ఓ సినిమా వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios