Asianet News TeluguAsianet News Telugu

Nepal plane crash: భార్య‌భ‌ర్తలుగా విడిపోయినా.. మృత్యు ఒడిలోకి ఒక్క‌టిగా..

Nepal plane crash: నేపాల్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో ప్ర‌యాణించిన భార‌తీయ కుటుంబ క‌థ విషాదాంత‌మైంది. నిజానికి మ‌హారాష్ట్ర‌ల‌కు చెందిన వ్యాపార వేత్త‌ అశోక్ కుమార్ త్రిపాఠి, ఆయ‌న భార్య వైభ‌వి ఎప్పుడో విడిపోయారు. మ‌ళ్లీ క‌లిసి జీవించాల‌నుకున్న ఆ జంట మృత్యు ఒడిలో ఒక్క‌టైంది. 
 

Estranged Indian Couple 10 Days A Year With Children Ends In Nepal Tragedy
Author
Hyderabad, First Published May 31, 2022, 12:54 PM IST

Nepal plane crash: వారిద్ద‌రి మ‌ధ్య చిన్న చిన్న‌ మనస్పర్థలు భార్యాభర్తల బంధానికి బీటలు వేశాయి. ఇక క‌లిసి జీవించ‌లేమ‌ని.. చట్టం ప‌రిధిలో విడాకులు తీసుకున్నారు. కానీ, కన్నబిడ్డల రూపంలో వారికి విధి  ద‌గ్గ‌రయ్యేలా చేసింది. ఓ పది రోజులు సంతోషంగా  విహారయాత్ర వెళ్లినా.. వారికి కుటుంబంలో విషాదం నెల‌కొంది. అంతులేని దుఖాన్ని మిగిల్చింది.   

నేపాల్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో  ఇప్పటిదాకా 22 మృతదేహాలను గుర్తించారు. అయితే.. ఆ విమానంలో ప్ర‌యాణించిన దుర్మరణం పాలైన భార‌తీయ కుటుంబ‌ క‌థ విషాదాంత‌మైంది. ఈ ప్రమాదంలో మ‌ర‌ణించిన వ్యాపారవేత్త అశోక్ కుమార్ త్రిపాఠి, ఆయ‌న భార్య వైభ‌వి నిజానికి ఎప్పుడో విడిపోయారు. దూరంగా ఉంటున్న ఆ జంట త‌మ పిల్ల‌ల కోసం.. మ‌ళ్లీ ఒక్క‌టి కావాల‌ని భావించింది. ఈ నేప‌థ్యంలో.. అశోక్ కుమార్ త్రిపాఠి, త‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నేపాల్ కు ఫ్యామిలీ టూర్‌కు వెళ్లింది. కానీ విమాన ప్ర‌మాదం వ‌ల్ల వారు శాశ్వ‌తంగా దూరం అయ్యింది. 

అశోక్ త్రిపాఠీ (54) ఒడిశాలో కంపెనీ న‌డిపారు. ఇక వైభ‌వి భండేక‌ర్ త్రిపాఠి  ముంబైలోని ద్రవ్య ఏజెన్సీలో పని చేస్తూ.. న తల్లితో ఉంటూ.. కన్నబిడ్డలిద్దరి బాధ్యతలు చూసుకుంటోంది. ఆ ఇద్ద‌రూ కోర్టు ఆదేశాల మేరకు కొన్నాళ్ల క్రితం విడిపోయారని థానేలోని కపూర్‌బావడి పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారి సోమవారం పేర్కొన్నారు. అయితే విడాకులతో విడిపోయినా ఆ జంటకు కలిసే అవకాశం కల్పించింది న్యాయస్థానం. ఏడాదిలో పది రోజుల పాటు కొడుకు, బిడ్డతో కలిసి సరదాగా గడపాలని ఆ జంటను ఆదేశించింది. ఈ క్రమంలో.. కొడుకు ధనుష్‌ (22), కూతురు రితిక(15)తో కలిసి ఈ ఏడాదికిగానూ హిమాలయా పర్యటనకు వెళ్లారు. 

ఈ క్ర‌మంలో ఆదివారం నేపాల్‌ టూరిస్ట్‌ సిటీ అయిన పొఖారాకు తారా ఎయిర్‌కు చెందిన వారి విమానంలో  ప్ర‌యాణించిన సంద‌ర్బంలో ఘోర ప్రమాదం జ‌రిగి.. ఈ కుటుంబం దుర్మరణం పాలైంది. వీళ్ల మరణ వార్తతో థానేలోని బల్కమ్‌ ఏరియాలో విషాదం నెలకొంది. ఇక్కడే రుస్తోమ్‌జీ అథేనా హౌజింగ్‌ సొసైటీలో వైభవి నివాసం ఉంటోంది. ప్రమాదం వార్త విని స్థానికులంతా దిగ్భ్రాంతికి లోన‌య్యారు. అనారోగ్యంతో ఉన్న వైభవి త్రిపాఠి తల్లి (80)కి  ఈ విషాదం గురించి తెలియదు.

పొఖారా సిటీ నుంచి టేకాఫ్ తీసుకున్న తారా ఎయిర్‌లైన్స్ విమానం ముస్తాంగ్ జిల్లాలో ఉన్న కొండ‌ల్లో ఆ విమానం కూలింది. ఈ విమాన ప్ర‌మాదంలో నలుగురు భారతీయులతో పాటు  ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాల్ ప్రయాణికులు, ముగ్గురు సభ్యుల నేపాల్ సిబ్బంది ఉన్నారు. కూలిపోయిన విమాన శిథిలాల నుంచి ఇప్పటి వరకు 20 మంది మృతదేహాలను గుర్తించిన‌ట్టు రెస్క్యూ సిబ్బంది తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios