హైదరాబాద్: ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. వివాహితకు మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పిన తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన హైదరాబాదులోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది.

నిందితుడిని శ్రీధర్ గౌడ్ గా గుర్తించారు. అతను మహిళకు మత్తుతో కూడిన బిస్కట్లు ఇచ్చాడు. అవి తిన్న మహిళ స్పృహ కోల్పోయింది. దాంతో ఆమెపై అతను అత్యాచారం చేసాడు. ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలను తీశాడు. వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. 

ఫొటోలను డిలీట్ చేయాలంటే రూ.20 కలక్షలు కావాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన సొమ్ము ఇవ్వకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. దాంతో ఆమె సైబరాబాద్ షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు. షీ టీమ్ అతన్ని పట్టుకుంది.

ట్యూషన్ టీచర్ నిర్వాకం

పాఠాలు చెబుతానంటూ  ట్యూషన్ టీచర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. షీ టీమ్ అతన్ని శనివారం అరెస్టు చేసింది. ఈ సంఘటన కూకట్ పల్లిలో వెలుగు చూసింది. టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరుపై బాలిక అప్పటికే తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు మందలించినా అతని తీరు మారలేదు. దీంతో షీ టీమ్ కు సమాచారం అందించారు. దాంతో ట్యూషన్ టీచర్ ను షీటీమ్ అరెస్టు చేసింది.