Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ ఎంపీ సెగ్మెంట్: కాంగ్రెస్‌లో చేరిన మరునాడే కడియం కావ్యకు టిక్కెట్టు

వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి  కడియం కావ్యకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.

Congress fields Kadiyam Kavya from Warangal loksabha segment lns
Author
First Published Apr 2, 2024, 7:20 AM IST | Last Updated Apr 2, 2024, 9:13 AM IST

హైదరాబాద్:వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది.  కాంగ్రెస్ పార్టీలో చేరిన  మరునాడే  కాంగ్రెస్ పార్టీ కావ్యకు టిక్కెట్టు కేటాయించింది.

వరంగల్ పార్లమెంట్ స్థానంలో కడియం కావ్యకు  బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. అయితే  తనకు టిక్కెట్టు కేటాయించినందుకు  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిసి కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు. అయితే  ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  కడియం కావ్య బీఆర్ఎస్ టిక్కెట్టును నిరాకరించింది.  ఈ విషయమై  కేసీఆర్ కు లేఖ రాశారు.

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి  నాలుగు రోజుల క్రితం మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కడియం కావ్యను కలిసి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు.  ఈ ఆహ్వానంపై   అనుచరులతో  కడియం శ్రీహరి  చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి  31న  కడియం శ్రీహరి, కడియం కావ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం  ఈ నెల 1వ తేదీన న్యూఢిల్లీలో జరిగింది.ఈ సమావేశంలో  పలు రాష్ట్రాల్లో  అభ్యర్ధుల ఎంపికపై చర్చించారు.  వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కడియం కావ్యకు  టిక్కెట్టును ఖరారు చేశారు.  ఈ మేరకు ఎఐసీసీ  సోమవారం నాడు  ఓ ప్రకటనను విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాల్లో  ఇప్పటికే  14 స్థానాల్లో అభ్యర్ధులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇంకా మూడు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఈ అభ్యర్ధులను కూడ  కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. Have your say! 📢https://telugu.asianetnews.com/mood-of-andhra-survey

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios