Asianet News TeluguAsianet News Telugu

ఫోన్ ట్యాపింగ్ కేసు‌ను సీబీఐకి అప్పగించాలి: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ కేసును  సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కోరారు.

BJP MP Laxman Demands Cbi enquiry on Phone tapping case lns
Author
First Published Apr 3, 2024, 12:28 PM IST

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును  సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని కోరారు.బుధవారంనాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో డాక్టర్ లక్ష్మణ్  మీడియాతో మాట్లాడారు.ఫోన్ ట్యాపింగ్ అంశంలో  దర్యాప్తు  అంశంలో రోజుకో  అంశం బయటకు వస్తున్న విషయాన్ని  ఆయన  గుర్తు చేశారు.రియల్టర్లను,నగల వ్యాపారులను దోచుకున్నారని కూడ  మీడియాలో వచ్చిందని  డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తావించారు.ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అసలు దోషులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశభద్రతకు భంగం కల్గించేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం సాగిందని డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు.  ఫోన్ ట్యాపింగ్ అంశంపై అసలు సూత్రధారులను కాపాడేందుకు  రేవంత్ రెడ్డి సర్కార్  ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.  ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపితే  అసలు విషయాలు వెలుగు చూస్తాయని  ఆయన  అభిప్రాయపడ్డారు. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ను డాక్టర్ లక్ష్మణ్ కోరారు.

ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయన్నారు. కానీ, చివరకు ఈ రెండు పార్టీలు కలిసి పోతాయని ఆయన  విమర్శించారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నిక సమయంలో  విపక్ష పార్టీల నేతలకు చెందిన  ఫోన్లను  ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ ను కలుస్తామన్నారు.  ఇవాళ గవర్నర్ అందుబాటులో లేరన్నారు. గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే ఈ విషయమై  ఫిర్యాదు చేస్తామన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేస్తే తమ పార్టీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.  బీజేపీకి, బీఆర్ఎస్ కు సంబంధం ఉన్నందునే  కవితను అరెస్ట్ చేయలేదని గతంలో  ఆరోపించిన విషయాన్ని  డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థల విధుల విషయంలో తాము ఎలా జోక్యం చేసుకుంటామని ఆయన ప్రశ్నించారు. 

 


 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios