నాన్ వెజ్ వండిన తర్వాత పాత్రలు వాసన వస్తున్నాయా..? ఇలా వదిలించండి..!
నాన్ వెజ్ వంటలు చేసిన తర్వాత కూడా పాత్రలు వాసన రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే.. ఈ సమస్య ఉండదు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, చేపల పులుసు .. పేర్లు వింటేనే నోరూరిపోతుంది కదా.. మనం సాధారణంగా నాన్ వెజ్ వంటలను ఇంట్లోనే వండుకోవడానికి ఇష్టపడుతుంటాం. వండినప్పుడు, తిన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ.. తర్వాత ఆ పాత్రలను ఎంత శుభ్రం చేసినా తొందరగా వాసన వదలవు. నీచు వాసన ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాసన వస్తుంటే.. మరోసారి ఆ గిన్నెలో కడగాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కడిగిన పాత్రే.. మళ్లీ, మళ్లీ కడగాల్సి వస్తుంది.
అయితే... నాన్ వెజ్ వంటలు చేసిన తర్వాత కూడా పాత్రలు వాసన రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే.. ఈ సమస్య ఉండదు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
1.నిమ్మకాయ.. మనం సాధారణంగా వంటలో భాగంగా నిమ్మకాయను వాడుతూ ఉంటాం. కానీ.. అదే నిమ్మకాయ మనకు చాలా వస్తువులను శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది. మీరు చేపలు, గుడ్లు, మాంసం లాంటి వంటలు చేసిన తర్వాత.. ఆ పాత్రల వాసనను తొలగించడానికి ఈ నిమ్మకాయను వాడొచ్చు. ఆ గిన్నెలో నిమ్మరసం పిండి.. కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితో తొందరగా వాసన పోతుంది. నిమ్మకాయలో ఉండే సహజ యాసిడ్ కారణంగా వాసన తొందరగా వదలుతుంది.
2.బేకింగ్ సోడా.. నిమ్మకాయ మాత్రమే కాదు.. బేకింగ్ సోడా కూడా పాత్రల నుంచి వచ్చే నీచు వాసనను సులభంగా వదిలిస్తుంది. పాత్రలు కడిగే సమయంలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి.. కాసేపు పాత్రలను పక్కన ఉంచాలి. కాసేపటి తర్వాత డిష్ సోప్్ తో కడిగితే సరిపోతుంది.
3.వెనిగర్.. వెనిగర్ ని ఆహారం రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా, ఈ వాసనలు వదిలించడానికి కూడా సహాయపడుతుంది. మాంసాహారం వండిన పాత్రలోపల వెనిగర్ వేసి పక్కన పెట్టాలి. ఒక 15 నిమిషాల తర్వాత.. డిష్ సోప్ తో కడిగితే సరిపోతుంది.
4.కాఫీ పొడి.. కాఫీ పొడితో కూడా పాత్రల వాసనను పోగొట్టవచ్చు. డిష్ వాషర్ లిక్విడ్ లో కొద్దిగా నీరు పోసి అందులో కాఫీ పొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పాత్రలకు పట్టించాలి. తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.
5.ఉప్పు... వంట పాత్రల దుర్వాసన వదిలించడానికి కూడా ఉప్పు సహాయపడుతుంది. చేపలు, లేదా గుడ్డు వంటి వంటలు చేసే సమయంలో వండే పాత్రలో కొద్దిగా ఉప్పు వేయండి. తర్వాత వండినా కూడా అది వాసన రాదు. వంట పూర్తైన తర్వాత.. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.