హైదరాబాద్‌: రహస్యంగా తీసిన ప్రైవేట్ ఫోటోలతో ఓ యువతిని స్నేహితుడే వేధింపులకు గురిచేశాడు. అయితే యువతి భయపడకుండా షీటీమ్ పోలీసులను ఆశ్రయించి యువకున్ని కటకటాల వెనక్కి తోయించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో నివాసముండే యువతి 2013లో ఎయిర్ హోస్టెస్ గా శిక్షణ పొందింది. ఈ సమయంలోనే ఆమెకు అరుణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరు పలుమార్లు పార్టీలకు వెళ్లారు. ఈ సమయంలోనే యువతి మత్తులో వున్న సమయాల్లో నగ్నంగా ఫోటోలను తీశాడు. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బైటపెట్టాడు. 

read more  కరోనా బాధిత యువతిపై... క్వారంటైన్ కేంద్ర సిబ్బంది అత్యాచారయత్నం

ఈ ఫోటోలను చూపించి బెదిరిస్తూ యువతిని ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఇటీవల యువతికి వచ్చిన ఓ పెళ్లిసంబంధాన్ని చెడగొట్టాడు. తనవద్ద వున్న యువతి నగ్నచిత్రాలను సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ పెట్టడమే కాకుండా యువతిని పెళ్ళిచేసుకోవాలని భావిస్తున్న యువకుడికి పంపించాడు. 

ఇలా అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో తట్టుకోలేకపోయిన యువతి షీటీమ్ ను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన  పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సెల్ ఫోన్ ను స్వాదీనం చేసుకున్నారు.