హైదరాబాద్: కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం చేరిన ఓ యువతిపై హాస్పిటల్ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వళితే.. రెండు వారాల క్రితం నాంపల్లికి చెందిన ఓ యువతికి కరోనా సోకగా చికిత్స కోసం ఎర్రగడ్డ ఆయుర్వేదిక హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో చేరింది. అయితే అదే హాస్పిటల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి కిరణ్ కన్న ఆ యువతిపై పడింది. ఇందులోబాగంగానే యువతితో పరిచయాన్ని పెంచుకుని ఆమెకు సాయం చేస్తున్నట్లు నటించాడు. 

read more  అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం... చికిత్స పొందుతూ బాధితుడి మృతి

ఈ క్రమంలోనే ఓరోజు అర్ధరాత్రి యువతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం, వెలికిగా మాట్లాడటం చేశాడు. దీంతో బాధిత యువతి అతడిపై డ్యూటీ డాక్టర్ కు ఫిర్యాదు చేసింది. అతడు యువతిని ఓదార్చి ఈ విషయాన్ని సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లగా అతడు పట్టించుకోకపోగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.  

అయితే బాధిత యువతి ఇటీవల కరోనా నుండి కోలుకుని ఇంటికి చేరుకుంది. తనపై హాస్పిటల్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన  విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఈ విషయం ఆలస్యంగా అయినా వెలుగులోకి వచ్చింది. కిరణ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయని... గతంలోనూ పలువురిని లైంగిక వేధించినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.