హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు హైదరాబాదులోని యాప్రాల్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై దాడి చేశారు. 

ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు అమ్మాయిలను కాపాడారు. ముంబై, బీహార్ ల నుంచి అమ్మాయిలను ఉపాధి పేరిట తీసుకుని వచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బీహార్ కు చెందిన వ్యక్తి సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని బీహార్ కు చెందిన రాజేశ్, కర్ణాటకకు చెందిన సురేష్, హైదరాబాదుకు చెందిన సాయి కిరణ్, నీలేష్, సిరాజ్ లుగా గుర్తించారు. 

ఇటీవల హైదరాబాదు పోలీసులు వనస్థలిపురంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ వ్యభిచార గృహాల గుట్టును రట్టు చేశారు.