హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం రహస్యాన్ని పోలీసులు బయటపెట్టారు. హైదరాబాదులోని పాతబస్తీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 

వివరాలు ఇలా ఉన్నాయి.... కాలాపత్తర్ పోలీసు స్టేష్ పరధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిర్వాహకులను, ఓ విటుడిని, ఏడుగురు బాధిత మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బాధిత మహిళలకు పోలీసులు విముక్తి కలిగించారు. అంతేకాకుండా 32 ేవల నగదును, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలైన మిస్కిన్, తరన్నుమ్ గత కొద్ది రోజులుగా ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

బాధిత యువతుల్లో ఇద్దరు పశ్చిమ బెంగాల్ కు, ఒకరు కర్ణాటకకు చెందినవారు. మిగిలినవారు హైదరాబాదు పాతబస్తీకి చెందినవారు. దాడిలో పట్టుబడిన నిర్వాహకులపై, విటుడిపై కేసు నమోదు చేసి బాధిత మహిళలనుు హోమ్ కు తరలించారు.