అతడో సాప్ట్ వేర్ ఉద్యోగి.  ఒంటరిగా ఉంటున్న అతడు ఇంట్లో పనులు చేయడానికి ఓ మహిళను పనిమనిషిగా నియమించుకున్నారు. మెళ్లగా ఆమెతో మాటలు కలిపి చనువు పెంచుకుని వల్లో వేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా ఆమెతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

ఈ హైదరాబాద్ టెకీ చేసిన నిర్వాకానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన నాగేశ్వరరావు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు తన ఇంట్లో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సెక్స్ లో పాల్గొంటూ వీడియో తీసి పోర్న్ సైట్ లో అఫ్ లోడ్ చేశాడు.  అయితే ఈ వీడియో గురించి ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్న భాదితురాలి కొడుకు ఈ విసయాన్ని తన తల్లితో చెప్పాడు. దీంతో బాధిత మహిళ నాగేశ్వరావు నిర్వాకం పై పోలీసులకు ఫిర్యాధు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా మరికొన్ని నిజాలు బైటపడ్డారు. 

నిందితుడు నాగేశ్వరరావు కొన్ని ఫోర్న వెబ్ సైట్ లలో ప్రీమియమ్ మెంబర్ గా ఉన్నాడు. ఈ వెమ్ సైట్ లలో ఫోర్న్ వీడియోలు అఫ్ లోడ్ చేసినందుకు వెబ్‌సైట్ వాళ్లు కూడా అతడికి డబ్బులు ఇస్తారు. ఇందుకోసమే తాను ఈ పని చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.దీంతో నాగేశ్వరరావును రిమాండ్ కు తరలించిన పోలీసులు అతడు అప్‌లోడ్ చేసిన ఆ పనిమనిషి వీడియోను వెబ్‌సైట్ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.