బ్రేకింగ్ : ప్రొటెం స్పీకర్ గా బిజెపి ఎమ్మెల్యే కెజి బొపయ్య

బిజెపి ఎమ్మెల్యే కే చాన్స్ ఇచ్చిన గవర్నర్..

Karnataka protem speaker Bopayya

సుప్రీంకోర్టు 24 గంటల ఆదేశాల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ప్రొటెం స్పకర్ గా కెజి బొపయ్యను గవర్నర్ వాజూభాయ్ నియమించారు. 24 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాల్సిందే అని యడ్యూరప్పకు సుప్రంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ నియామకం జరిగిపోయింది. కాంగ్రెస్ సూచనలు, సలహాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రొటెం స్పకర్ నియామకం జరిగిపోయిందన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి.

సాధారణంగా అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించే ఆనవాయితీ ఉంది. అన్ని సందర్భాల్లోనూ ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యుడినే నియమిస్తూ ఉంటారు. అయితే ప్రొటెం స్పీకర్ బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే ఆయన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం.. కొత్త స్పీకర్ నియమితులైన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పగించడం వరకే ప్రొటెం స్పీకర్ బాధ్యత ఉంటుంది.

కానీ కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు వేరు. హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. హంగ్ వచ్చిన నేపథ్యంలో సాంప్రదాయాలను పక్కనపెట్టినట్లు చర్చ జరుగుతోంది. రేపు  ప్రొటెం స్పీకరే పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు. ప్రొటెం స్పీకర్ గా నియమితులైన వ్యక్తి బిజెపి సర్కారు భవిష్యత్తును నిర్దేశించే వాతావరణం ఉంది. ఇక్కడ కెజి బొపయ్య ప్రొటెం స్పీకర్ గా కేవలం సభ్యుల చేత ప్రమాణం చేయించడమే కాకుండా బలపరీక్షను సైతం నిర్వహించే బాధ్యత ఆయన మీదే ఉంది. ఈ నేపథ్యంలో గత సాంప్రదాయాలను పక్కన పెట్టి కర్ణాటక గవర్నర్ సీనియర్ మెంబర్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించకుండా బిజెపికి చెందిన బొపయ్యను నియమించి కొత్త చర్చను లేవనెత్తారు. ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సినియర్ సభ్యుడిని నియమించాలని ఇప్పటికే కాంగ్రెస్, జెడిఎస్ గవర్నర్ కు విన్నవించాయి. 8సార్లు అసెంబ్లీకి ఎన్నికైన దేశ్ పాండేను ప్రొటెం స్పీకర్ గా నియమించాలని కోరాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ సభ్యుడు దేశ్ పాండే ఉన్నప్పటికీ గవర్నర్ వాజుభాయ్ మాత్రం బిజెపి సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించేందుకే మొగ్గు చూపారు.

అయితే రేపటి బిజెపి కర్ణాటక సర్కారు భవితవ్యం కెజి బొపయ్య మీద ఆధారపడి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక ప్రొటెం స్పకర్ నియామకంలోనూ గవర్నర్ పక్షపాతం చూపారని కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios