పోకిరీల వేధింపులు తట్టుకోలేక తండ్రీ కూతుళ్ల ఆత్మహత్య

daughter and father suicide
Highlights

పోకిరీల వేధింపులు తట్టుకోలేక తండ్రీ కూతుళ్ల ఆత్మహత్య

కొందరు పోకిరీ యువకులు తన కూతురిని వేధించడంతో  కలత చెందిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక లో చోటుచేసుకుంది. తన తండ్రి ఆత్మహత్య వార్త విని తట్టుకోలేక కూతురు కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా గౌడనబావి గ్రామానికి చెందిన రమణగౌడ కు బసవలింగమ్మ అనే కూతరు ఉంది. అయితే ఇదే గ్రామానికి చెందిన కొందరు ఆకతాయీలు బసవలింగమ్మను వేధించేవారు. ఈ క్రమంలో యువతి అసభ్యకర ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. వీటిని చూసిన రమణగౌడ ఇలా ఎందుకు పెట్టారని ప్రశ్నించగా  ఎదురుదాడికి దిగారు. దీంతో కూతురికి అవమానం జరగడమే కాకుండా తనను అవమానపర్చడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమణగైడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణ వార్త తెలిసి తట్టుకోలేకపోయిన కూతురు బసవలింగమ్మ కూడా ఇంట్లోవున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచుకుంది.

ఈ ఆత్మహత్యకు కారణమైన పోకిరీలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తండ్రీకూతురు మృతికి ఆకతాయిలు కారణమని తెలుసుకున్న గ్రామస్థులు నిందితులను అదుపులోకి తీసుకునేంత వరకు అంత్యక్రియలు నిర్వహించబోమంటూ ఆందోళన చేశారు. అయితే జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గ్రామస్తులను, బందువులను సముదాయించారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

loader