భారీగా పెరుగుతున్న బంగారం ధర.. కొనలేం కానీ.. అమ్ముకోవచ్చా..?
ఇంతలా రేటు పెరగడానికి కారణం ఏంటి..? ఇలాంటి సమయంలో బంగారం అమ్మాలి అనుకోవడం మంచి నిర్ణయమైనా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
Gold Prices Are Rising- Should you buy now or wait
బంగారం ధర రోజు రోజుకీ పెరిగిపోతోంది. సామాన్యులు అసలు బంగారం కొనగలరా అన్నట్లుగా ఉన్నాయి ధరలు. తులం బంగారం ధర దగ్గరదగ్గరగా రూ.70వేలు ఉంది. ఇక.. ఆభరణాలు కొనాలి అంటే..దాని మేకింగ్ చార్జీలు, జీఎస్టీలు అంటూ.. ఇంకా పై ఖర్చులు చాలానే ఉంటాయి. దీంతో తులం బంగారం కొనాలంటే చేతిలో రూ. లక్ష ఉండాల్సిందే.
gold
ఈ బంగారం ధర ఇంకా పెరిగేలానే ఉంది కానీ.. తగ్గేలా మాత్రం కనిపించడం లేదు. అసలు వచ్చే రోజుల్లో అయినా బంగారం ధర తగ్గుతుందా..? ఇంతలా రేటు పెరగడానికి కారణం ఏంటి..? ఇలాంటి సమయంలో బంగారం అమ్మాలి అనుకోవడం మంచి నిర్ణయమైనా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే.. బంగారం ధర రోజు రోజుకీ పెరుగుతందే తప్ప.. తగ్గింది లేదు. ఈ లెక్కన ఈ ధర ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ.. తగ్గుతుందని గ్యారెంటీ లేదు. ఒకవేళ తగ్గినా అది కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. కాబట్టి.. మనకు తగ్గిన ఫీల్ కూడా రాదు.
అసలు బంగారం ఇంతలా ఎందుకు పెరుగుతోంది..? అంటే కారణాలు లేకపోలేదు. అమెరికాలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నెలకొంది. అది రోజు రోజుకీ పెరుగుతోంది. ఫలితంగా.. దాని ప్రభావం బంగారం పెరగడానికి కారణమౌతోంది. అంతేకాదు స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కూడా బంగారం ధర పెరగడానికి కారణం కావచ్చు. ఇక.. మదుపర్లందరూ బంగారాన్ని ఒక పెట్టుబడిగా చూస్తూ ఉంటారు. అది కూడా ప్రధాన కారణమైంది.
ఎవరిదాకో ఎందుకు.. మన దేశంలోనే చూసుకుందాం.. కాస్త డబ్బు ఉంది అంటే చాలు వెంటనే బంగారం కొనేస్తూ ఉంటారు. అది ధర పెరుగుతూనే ఉంటుుంది కాబట్టి.. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకుంటుుందని నమ్ముతున్నారు. డబ్బులను బ్యాంకులో పెట్టుకున్నా పెద్దగా వడ్డీల రూపంలో వచ్చేది లేదు. అందుకే బంగారం కొనడమే మంచిదని.. ఆస్తులను పెంచుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు. వీళ్లు ఇలా కొంటూ ఉండటం వల్ల చివరికి ధర పెరుగుతోంది.
కాస్త డబ్బు ఉన్నవారంటే పెరిగినా కొంటూ ఉంటారు. కానీ.. మధ్య తరగతి, దిగువ తరగతి వాళ్లతోనే అసలు సమస్య. ఈ పెరుగుతున్న రేట్లు చూసి వాళ్లు బంగారం కొనే ఆలోచనను ఆదిలోనే తుంచేసుకుంటున్నారు. కొనలేకపోగా.. ఉన్న కాస్తో, కూస్తో బంగారాన్ని కూడా అమ్మేసుకుంటున్నారు. చాలా మంది... ఇది మంచి సమయం కదా... రేటు బాగా పెరిగింది కదా.. ఇప్పుడు అమ్ముకుంటే కాస్త డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ.. బంగారం అమ్మడానికి ఇది సరైన సమయం కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. నిజంగా అమ్ముకోవాలనే ఆలోచనలో ఉంటే.. ఇంకా కొంతకాలం వేచి ఉంటే.. ఇంకా మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక.. పెట్టుబడి పరంగా బంగారం కొనాలి అనుకునేవారు ఆభరణంగా కొనడం కంటే.. గోల్డ్ బాండ్ రూపంలో కొనడమే ఉత్తమం. ఎందుకంటే.. ఆభరణంగా కొనడం వల్ల మేకింగ్ ఛార్జెస్ రూపంలో కాస్త నష్టపోయే అవకాశం ఉంది. కానీ.. బాండ్ రూపంలో కొనడం వల్ల అలాంటి నష్టం ఉండదు. మంచి పెట్టుబడిగా కూడా ఉంటుంది.