ఈ చీరలు చాలా కాస్లీ.. ధర తెలిస్తే అవాక్కే..!
భారతీయ దుస్తుల్లో చీరలు ఒక ప్రత్యేక భాగం. పెళ్లైన వారే కాదు పెళ్లికాని అమ్మాయిలు కూడా చాలా ఫంక్షన్లకు చీరలనే కట్టుకెళుతుంటారు. మీకు కూడా చీరలు చాలా ఇష్టమైతే మీ మీ వార్డ్ రోబ్ లో ఈ ప్రత్యేకమైన చీరలను చేర్చండి. ఇవి మీ అందాన్ని మరింత పెంచుతాయి తెలుసా?
ఇండియాలో ఉన్న ఎన్నో దుస్తుల్లో చీరలు చాలా చాలా ప్రత్యేకమైనవి. కాలం మారుతున్న కొద్దీ చీర కట్టుకునే విధానం, ఆకృతి మారుతూ వస్తోంది. కానీ చీరలు కట్టుకోవడం మాత్రం మానలేదు. ఒకప్పుడు రెండు మూడు రకాల చీరలు మాత్రమే దొరికేవి. ఇప్పుడు లెక్కలేనన్ని వెరైటీ చీరలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. సంప్రదాయ వేడుకల్లోనే కాకుండా ప్రతి ఈవెంట్ కు చీరలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే అసలు చీరలను తయారుచేయడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది? వీటిని ఎలా తయారుచేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? అందులోనూ కొన్ని రకాల చీరల ధరలు లక్షల్లో ఉంటాయి. ఈ చీరలకు ఎందుకంత ధర అని డౌట్ వచ్చిందా? పదండి ఈ ఆర్టికల్ లో ఏ రకం చీరను ఎన్ని రోజులు తయారుచేస్తారు? ఎంత ధర ఉంటుందో తెలుసుకుందాం.. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ చీరలు మీ లుక్ ను పెంచుతాయి. అందుకే కుదిరితే ఈ చీరలు మీ వార్డ్ రోబ్ లో చేర్చండి.
బనారసి చీర
బనారసి చీరలను తయారు చేయడం, కట్టుకునే ట్రెండ్ మొఘల్ కాలంలోనే ప్రారంభమైంది. ఈ చీరలు మొఘల్ ప్రభావిత డిజైన్లతో తయారుచేస్తారు. ఇంటర్ఫ్లంగ్ ఫ్లోరల్, ఫోలేట్ ఆకృతులు, కుల్లెట్లు, బెల్స్, ఫ్రింజ్స్ వంటి ఆకు డిజైన్లతో ఉంటాయి. ఈ చీరలను తయారుచేయడానికి రెండు వారాల నుంచి నెల రోజుల సమయం పడుతుంది. చాలా చీరలకు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయంలో తయారుచేస్తారు.
నారీ-కుంజర్ భట్
ఈ చీరను గుజరాత్ లోని పటాన్ లో తయారు చేస్తారు. దీని ప్రత్యేకత దీనికున్న డిజైన్, ఫ్యాబ్రిక్. ఈ డిజైన్లను నారీ-కుంజర్ భట్, పాన్ భట్, నవరత్న భట్, వోహ్రాగాజీ, ఫుల్వతి భట్, రతన్ చౌక్ భట్ వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఈ డిజైన్లలో పక్షులు, పువ్వులు, మనుషుల బొమ్మలు ఉంటాయి. ఇది గుజరాత్ సంప్రదాయ చీర. కానీ దీని ధర తెలిస్తే అవాక్కౌతారు.
కాంజీవరం
గోల్డెన్ జరీ బోర్డర్, కాంట్రాస్ట్ కలర్ ప్యాటర్న్, ట్రెడిషనల్ డిజైన్ కారణంగా ఈ చీరను ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ చీరను బంగారం, వెండి తీగలతో తయారు చేస్తారు. అందుకే ఈ చీర ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. లుక్ తో పాటు ఈ చీరను తయారు చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. చీర బాడీ, బోర్డర్, పల్లా విడివిడిగా తయారు చేసి ఆ తర్వాత కలుపుతారు.
చందేరి
బంగారు జరీ, తేలికపాటి బరువు, మెరిసే చీరలతో చందేరీ చీరలనేస్తారు. బరోడా మహారాణి కళాకారులకు అత్యుత్తమ నూలును ఇవ్వడం ద్వారా చందేరీ చీరలను నేసేవారని నమ్ముతారు. ఈ చీరల ప్రత్యేకత ఏమిటంటే.. ఒక చీర మొత్తాన్ని పిడికిలో పట్టుకోవచ్చు. పూర్వకాలంలో రాజ కుటుంబానికి చెందిన మహిళలు కుంకుమపువ్వు రసంతో చీరల దారాలకు రంగులు వేసేవారు. దాని వల్ల చీరల నుంచి కుంకుమ సువాసన కూడా వచ్చేది. చక్కని జరీ బోర్డర్ చందేరి చీరలకు డిఫరెంట్ లుక్ ఇస్తుంది. దీని జరీని వెండితో చేసిన దారాలతో పూస్తారు.
జమ్దానీ చీరలు
జమ్దానీ చీరలను బంగ్లాదేశ్ లో ప్రత్యేకంగా తయారు చేస్తారు. చక్కటి దారాలతో తయారు చేసిన ఈ చీర చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని బరువు కూడా ఎక్కువగా ఏం ఉండదు. కానీ దీని ధర మాత్రం ఎక్కువే. జమ్దానీ చీరలు కూడా 20 వేల నుంచి 2 లక్షల వరకు లభిస్తాయి.